Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: నూతన పార్లమెంటు భవనం ప్రారంభంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయబోతున్న ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు. ‘‘పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్య దేవాలయం. అది మన దేశం యొక్క ఆత్మను ప్రతిబింబిస్తుంది. అది మన దేశ ప్రజలకే కాదు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినది. ఇలాంటి శుభకార్యక్రమాన్ని బహిష్కరించడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు. రాజకీయ విభేదాలన్నింటినీ పక్కనపెట్టి, ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావాలని కోరుతున్నాను. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి వైయస్ఆర్ సీపీ హాజరవుతుంది’’ అని సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.