Best Web Hosting Provider In India 2024

పార్వతీపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ మేలు చేస్తుందని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. ఆవాలవలస గ్రామంలో ఎమ్మెల్యే గడప గడపకు కార్యక్రమం చేపట్టి ప్రజల దీవెనలు అందుకున్నారు. సీతానగరం మండలం, బూర్జ సచివాలయం పరిధిలో గల ఆవాలువలస గ్రామంలో గురువారం 226వ రోజున ఎమ్మెల్యే అలజంగి జోగారావు గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని వారికి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అమలు తీరును అడిగి తెలుసుకుని, వారికి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు, గ్రామంలో గల సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారం అయ్యేలా చూడమని ఆదేశించారు.