Bigg Boss Nayani: బిగ్ బాస్‌లో పల్లవి ప్రశాంత్‌పై చర్చ.. బండ బూతులు తిట్టారన్న టేస్టీ తేజ.. వెక్కి వెక్కి ఏడ్చేసిన నయని

Best Web Hosting Provider In India 2024


Bigg Boss Telugu 8 October 8th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మరింత జోరందుకుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన కంటెస్టెంట్స్‌లో కూడా అప్పుడే గొడవలు మొదలు అయ్యాయి. బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 8వ తేది ఎపిసోడ్‌లో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ జరిగింది.

నామినేట్ చేయకూడదు

బిగ్ బాస్ 8 తెలుగు ఆరో వారం నామినేషన్స్‌లో ఆరుగురు నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగు ఈ వారం నామినేషన్స్‌లో యష్మీ గౌడ, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, కిర్రాక్ సీత, మెహబూబ్, గంగవ్వ ఉన్నారు. అయితే, రాయల్ క్లాన్స్‌ (వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్)లో ఇమ్యునిటీ పవర్ ఉపయోగించి ఒకరిని నామనేషన్స్ నుంచి సేవ్ చేయొచ్చు. వారిని ఓజీ క్లాన్ నామినేట్ చేయకూడదు అని బిగ్ బాస్ చెప్పాడు.

దాంతో నయని పావనికి స్టార్ ఇమ్యునిటీ పవర్ ఇచ్చి సేవ్ చేశారు మిగతా రాయల్ క్లాన్ మెంబర్స్. అయితే, గత సీజన్ (బిగ్ బాస్ తెలుగు 7)లో నయని పావని వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన తొలి వారమే హౌజ్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. మరోసారి అలా జరగకూడదని, రిస్క్ తీసుకోవడం ఎందుకుని తన పాయింట్ చెప్పాడు గౌతమ్. దాంతో మిగతా వారంతా అంగీకరించారు.

సీజన్ 4 గురించి

అలా నయని పావనిని ఆరో వారం నామినేషన్స్ నుంచి సేవ్ చేశారు రాయల్ క్లాన్ మెంబర్స్. కట్ చేస్తే.. జబర్దస్త్ అవినాష్‌తో బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ గురించి డిస్కషన్ పెట్టింది కిర్రాక్ సీత. ఇంతలో నయని పావని అక్కడికి వచ్చింది. వారికి ఎదురుగా టేస్టీ తేజ, మెహబూబ్ వాళ్లు ఉన్నారు. వైల్డ్ కార్డ్‌గా వచ్చిన వారమే నయని ఎలిమినేట్ కావడంతో ఎవరు నామినేట్ చేశారనని ఆమెను సీత అడిగింది.

పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. నేను ఎక్కడ పని చేయలేదని చెప్పాడు అని సీతతో చెప్పిన నయని పావని.. నేను రోజంతా పని చేస్తూనే ఉన్నాను కదా అని అదే సీజన్ కంటెస్టెంట్ అయిన తేజతో కాస్తా ఫీల్ అవుతూ అంది. తర్వాత గౌతమ్ కృష్ణ నామినేట్ చేశాడని చెప్పింది నయని. ఇలా మొదట సరదాగా సాగిన డిస్కషన్ ఒక్కసారిగా సీరియస్ అయింది.

బండబూతులు తిట్టారు

పక్కన కూర్చున్న తేజ వచ్చి నేను హండ్రెడ్ పర్సంటే ఇచ్చాను. నాది ఇంతవరకు హండ్రెడ్ పర్సంట్.. నీది హండ్రెడ్ పర్సంట్ వేరేలా ఉండొచ్చు అని తేజ సీరియస్‌గా అన్నాడు. డిస్కషన్ ఎటో వెళ్లపోతుంది. సీరియస్ అవుతుందేంటీ అని సీత అప్పటికీ అనుకుంటూనే ఉంది. ఇంతలో నీ ఆట చూసుకో. “నిన్ను బండబూతులు తిట్టారు” రివ్యూవర్లు అని తేజ అన్నాడు. ఎవరన్నారు అని నయని అడిగింది.

వెళ్లి చూసుకో అని కాస్తా రూడ్‌గానే మాట్లాడాడు తేజ. కాసేపు సైలెంట్‌గా ఉన్న నయని ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. అవినాష్, సీత, మెహబూబ్ ఏమైందని ఆరా తీశారు. కానీ, అక్కడి నుంచి వెళ్లిపోయింది నయని. తన బెడ్‌మీదకు వెళ్లి ఎక్కి ఎక్కి ఏడ్చింది. మెహబూబ్, యష్మీ వచ్చి ఓదార్చారు. “నేను మొదటి వారమే ఎలిమినేట్ అయ్యాననే బాధ సంవత్సరంపాటు పడ్డాను” అని నయని చెప్పింది.

“అలా ఎలా అంటాడు. అంత రూడ్‌గా మాట్లాడాడు. సరదాగా డిస్కషన్ నడుస్తోంది. ఒక్కసారిగా అలా పైకి వచ్చి నాపై పడినట్లు మాట్లాడాడు. నేను సంవత్సరం పాటు ఆ ట్రామా ఫేస్ చేశాను. అంతకుముందే మా నాన్న చనిపోయారు. తను అలా అనేసరికి అదంతా ఒక్కసారిగా ఫ్లాష్ అయింది. ఇప్పుడు బండ బూతులు తిట్టారని అలా ఎలా అన్నాడు. మరి అలాంటప్పుడు నేను ఎలిమినేట్ అయినప్పుడు ఎందుకు ఏడ్చాడు” అని వెక్కి వెక్కి ఏడ్చింది నయని పావని.

షాక్ అయిన తేజ

టిష్యూ పేపర్స్ ఇచ్చి మెహూబూబ్, గౌతమ్, యష్మీ ఓదార్చారు. మరోవైపు నయని ఏడవడంపై తేజకు క్లారిటీ ఇచ్చారు అవినాష్, మెహబూబ్. బండ బూతులు తిట్టావని అన్నావ్ అని అవినాష్ అంటే.. నేను అలా అన్నానా. నిజంగా నా నోటీ నుంచి అలా వచ్చిందా అని తేజ ఆశ్చర్యంగా అన్నాడు. దాంతో షాక్ అవుతూ నయని దగ్గరికి వెళ్లి సారీ చెప్పాడు తేజ.

తన ఇంటెన్షన్ అది కాదని, ఏదో అనబోయి ఇంకేదో అన్నాను అని వివరణ ఇచ్చుకున్నాడు తేజ. దానికి ఇట్స్ ఓకే అని, పర్లేదు అని నయని చెప్పి వెళ్లిపోయింది. ఏంట్రా తేజ.. నోరు ఆగదా.. ఇంత చిన్న విషయానికీ అని తనలో తానే ఫీల్ అయిపోయినట్లు కనిపించాడు టేస్టీ తేజ.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024