Best Web Hosting Provider In India 2024

విజయవాడ: చంద్రబాబుది వెన్నుపోటు మేనిఫెస్టో అని, మహానాడులో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పాడని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పిల్లనిచ్చి, రాజకీయ భిక్షపెట్టిన ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన నీచుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. మినీ మేనిఫెస్టో అంటూ పచ్చి అబద్ధాలతో మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడని, చంద్రబాబును ప్రజలు ఎప్పటికీ నమ్మరన్నారు. సీఎం వైయస్ జగన్ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారన్నారు.