Diabetes: మధుమేహులు నెయ్యి తినడం మంచిదేనా? ఏ సమయంలో వారు నెయ్యి తినడం ప్రమాదకరం?

Best Web Hosting Provider In India 2024

భారతీయ ఇళ్లల్లో కచ్చితంగా ఉండే ఆహారం నెయ్యి. దీన్ని రోజూ ఒక స్పూను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు పోషకాహార నిపుణులు. దీనిని రోటీ, పరాఠా నుండి బిర్యానీ వరకు అన్నింటిలో దీన్ని ఉపయోగించవచ్చు. నెయ్యిని ఆహారంలోనే కాకుండా పూజలో కూడా ఉపయోగిస్తారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు నెయ్యి తినవచ్చా లేదా అన్న సందేహం మాత్రం ఎక్కువ మందిలో ఉంది. డయాబెటిస్ ఉన్న వారు ఎప్పుడు నెయ్యి తినాలి? ఎప్పుడు తినకూడదో తెలుసుకోవాలి.

మధుమేహులు నెయ్యి తినవచ్చా?

డయాబెటిక్ రోగులు వారు తినే ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే వారు తినే ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండేలా చూసుకుంటారు. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి, ఇది సమస్యలకు కారణం అవుతుంది. అదే సమయంలో, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం గ్లూకోజ్ విడుదలను నెమ్మదించేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుంది. ఇక నెయ్యి విషయానికొస్తే ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. నెయ్యిని జోడించడం వల్ల ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారు వారి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు నెయ్యి తినడం ఆరోగ్యకరమే. కానీ ఎంత తింటున్నారో మాత్రం ఓసారి చెక్ చేసుకోవాలి. రోజుకు ఒక స్పూను నెయ్యి తింటే సరిపోతుంది. అంతకుమించి ఎక్కువగా తింటే మాత్రం కొలెస్ట్రాల్ పెరిగిపోయే అవకాశం ఉంది.

నెయ్యి ప్రయోజనాలు

నెయ్యి కలపడం వల్ల ఆహారం రుచిని పెంచుతుంది, కాబట్టి ప్రజలు దీనిని ఆహారంలో ఎక్కువగా కలుపుకుని తినేందుకు ప్రయత్నిస్తారు. కానీ మీకు డయాబెటిస్ ఉంటే నెయ్యిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. పప్పు లేదా అన్నంలో ఒక టీస్పూన్ కంటే ఎక్కువ నెయ్యి కలపకూడదు. అధిక పిండి పదార్థాలు ఉన్న ఏదైనా ఆహారంలో ఒక టీస్పూన్ నెయ్యిని మాత్రమే జోడించవచ్చు. వీలైతే స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించడానికి ప్రయత్నించండి, ఇంట్లోనే తయారు చేసినదే మంచిది.

మీరు గర్భధారణ సమయంలో అధిక బరువు కలిగి ఉంటే, నెయ్యి తక్కువగా తినండి. ఇది కాకుండా, మీకు సిరోసిస్, స్ప్లెనోమెగలీ, హెపటోమెగలీ, హెపటైటిస్ వంటి మూత్రపిండాలు, గుండె లేదా కాలేయ వ్యాధులు ఉంటే నెయ్యికి దూరంగా ఉండాలి. అలా కాకుండా అజీర్తి, కడుపు సమస్యలతో బాధపడుతుంటే నెయ్యి తినకూడదు.

నెయ్యిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి కావాల్సిన పోషఖాలు. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. పిల్లలకు రోజుకో స్పూను నెయ్యి తినిపించడం వల్ల వారి మెదడు వికసిస్తుంది. గుండె కోసం ప్రత్యేకంగా ప్రతిరోజూ ఒక స్పూను నెయ్యి తినాల్సిందే.

( గమనిక: ఈ వ్యాసం మీ సమాచారం కోసం మాత్రమే, వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. వైద్యసహాయం కావాలంటే వైద్యులను సంప్రదించండి)

Whats_app_banner

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024