Best Web Hosting Provider In India 2024
OTT Telugu Psychological Thriller: ఓటీటీలు వచ్చాక డిఫరెంట్ కంటెంట్ సినిమాలు పెరిగాయి. విభిన్న కథాంశాలతో సినిమాలు, వెబ్ సిరీసులను తెరకెక్కిస్తున్నారు. వాటిలో హారర్, కామెడీ, బోల్డ్, క్రైమ్ సస్పెన్స్ వంటి జోనర్స్‌తోపాటు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ కూడా ప్లేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
డిజిటల్ ప్రీమియర్
ఇక వాటిలో కొన్ని నేరుగా ఓటీటీ రిలీజ్ అవుతుంటే.. మరికొన్ని థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఆ సినిమాల టాక్, కలెక్షన్స్ పరంగా ఓటీటీ రిలీజ్ డేట్ ఉంటోంది. అయితే, ఇటీవలే థియేటర్లలో విడుదలైన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా కేవలం 13 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేయనుంది. అది కూడా మరికొన్ని గంటల్లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను ఈటీవీ విన్ విడుదల చేసింది.
మంచి రెస్పాన్స్
ఆ సినిమానే కలి. యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటించిన సినిమా ఈ చిత్రానికి శివ శేషు దర్శకత్వం వహించారు. ప్రముఖ కథా రచయిత కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఈ నెల అంటే అక్టోబర్ 4వ తేదీన థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్
ఇప్పుడు కలి మూవీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో అక్టోబర్ 17 నుంచి కలి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అంటే, అక్టోబర్ 17 అర్ధరాత్రి నుంచే ఈటీవీ విన్‌లో కలిని ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. ఈ లెక్కన అందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.
మంచి పాయింట్‌తో
ఇక కలి మూవీ స్టోరీలోకి వెళితే.. సమాజాన్ని పట్టి పీడిస్తున్న జాఢ్యం ఆత్మహత్యలు. ఆత్మహత్యకు పురికొల్పే ఆలోచలను కొద్ది సేపు నియంత్రించుకుంటే ఎన్నో ప్రాణాలు నిలుస్తాయనే మంచి పాయింట్ తో కలి సినిమా రూపొందింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మంచి మ్యూజిక్, ఎంటర్‌టైన్ చేసే క్యారెక్టర్స్‌తో ఈ సినిమా ప్రేక్షకుల్ని థియేటర్స్‌లో ఆకట్టుకుంది.
మరింత ఆదరణ
ఇప్పుడు ఈటీవీ విన్‌లోనూ మరింతగా మూవీ లవర్స్ ఆదరణను కలి పొందనుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్‌గా వచ్చిన కలి మూవీలో ప్రిన్స్, నరేష్ అగస్త్యతోపాటు నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
కలి పురుషుడి పాత్రకు
ఇక కలి ప్రమోషన్స్‌లో సినిమా గురించి డైరెక్టర్ శివ శేషు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. పురాణాల్లోని కలి పురుషుడి పాత్రను స్ఫూర్తిగా తీసుకుని కలి మూవీ చేసినట్లు, సమయాన్ని, ఆత్మను ఆధారం చేసుకుని ఈ యుగాన్ని ప్రభావితం చేసే కలిని కథలో చూపించినట్లు డైరెక్టర్ పేర్కొన్నారు.
ఆలోచనలు రావు
“ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఎవరైనా అడ్డుకుని, వారికి ఆ ఆలోచనను దూరం చేస్తే బాగుంటుంది. ఆత్మహత్య చేసుకోవాలని అనుకునేవారికి మరోసారి అలాంటి ఆలోచనలు రావు. దర్శకుడు శివ శేషు ఈ పాయింట్‌తో కలి సినిమా కథ రాసుకున్నాడు. కథ విన్నప్పుడు నాకు కొత్తగా అనిపించింది. ఇలాంటి నేపథ్యంతో సినిమా ఎవరూ చేయలేదనిపించింది” అని కథా రచయిత రాఘవేంద్ర రావు తెలిపారు.