Special Trains: దీపావ‌ళికి అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాలు మీదుగా ప్రత్యేక రైళ్లు

Best Web Hosting Provider In India 2024


Special Trains: దీపావళి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని వెస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ప్రత్యే రైళ్లను ప్రకటించారు. ఎస్ఎంవీటీ బెంగళూరు-కలబురగి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06533) రైలు అక్టోబర్ 30, నవంబర్ 2 తేదీలలో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు బెంగళూరులోని శ్రీ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ (ఎస్ఎంవీటీ) నుండి రాత్రి 9.15 గంటలకు బయలుదేరి, మ‌రుస‌టి రోజు ఉద‌యం 7.40 గంటలకు కలబురగి చేరుతుంది.

కలబురగి-ఎస్ఎంవీటీ బెంగళూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06534) రైలు అక్టోబర్ 31, నవంబర్ 3 తేదీలలో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కలబురగి నుండి ఉదయం 9.35 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 8 గంటలకు శ్రీ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ (ఎస్ఎంవీటీ) బెంగళూరు చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు యలహంక, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, అదోని, మంత్రాల‌యం, రాయ‌చూర్‌, కృష్ణ‌, యాద‌గిరి, షాబాద్ స్టేష‌న్ల‌లో ఆగుతుంది. ఈ రైలులో 12 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, 3 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 2 ఏసీ త్రీ-టైర్ కోచ్‌లు, ఒక లగేజీ, బ్రేక్ వ్యాన్ కమ్ జనరేటర్ కార్, ఒక సెకండ్ క్లాస్ లగేజీ, దివ్యాంగు కోచ్‌తో కూడిన బ్రేక్ వ్యాన్ సహా 19 కోచ్‌లు ఉంటాయి.

నాలుగు రైళ్ల‌కు అద‌న‌పు స్లీపర్ క్లాస్ కోచ్‌లు

పండుగ సీజన్‌లో వెయిట్‌లిస్ట్ చేసిన ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి నాలుగు రైళ్ల‌కు అద‌న‌పు కోచ్‌లు పెంచాల‌ని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. రూర్కెలా-గుణపూర్ రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ (18117) రైలుకు అక్టోబ‌ర్ 16 నుండి 19 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్ జ‌త చేశారు. గుణుపూర్ – రూర్కెలా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ (18118) రైలుకు అక్టోబ‌ర్ 17 నుండి 20 వరకు ఒక స్లీప‌ర్ క్లాస్ కోచ్ జ‌త‌చేశారు.

రూర్కెలా-జగ్దల్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18107) రైలుకు అక్టోబ‌ర్ 16, 17, 19 తేదీల‌లో ఒక స్లీపర్ క్లాస్ కోచ్ జ‌త చేశారు. జగ్దల్‌పూర్ -రూర్కెలా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18108) రైలుకు అక్టోబ‌ర్ 17, 18, 20 తేదీల్లో ఒక‌ స్లీపర్ క్లాస్ కోచ్ జ‌త చేశారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner

టాపిక్

VisakhapatnamSpecial TrainsAnantapurKurnool

Source / Credits

Best Web Hosting Provider In India 2024