Bigg Boss 8 Telugu: చార్జింగ్ కోసం హౌస్‍మేట్స్ పోరాటం.. నబీల్ కళ్లుకప్పిన చార్జ్ చేసుకున్న అవినాశ్: వీడియో

Best Web Hosting Provider In India 2024


బిగ్‍బాస్ 8 తెలుగులో ఏడో వారం కొనసాగుతోంది. నామనేషన్ల హీట్ తర్వాత నేడు (అక్టోబర్ 16) కంటెస్టెంట్లకు బిగ్‍బాస్ ఓ ఇంట్రెస్టింగ్ గేమ్ ఇచ్చారు. 2050వ సంవత్సరంలో చార్జింగ్ కోసం పోరాడాలంటూ చెప్పారు. ఈ గేమ్ నేటి ఎపిసోడ్‍లో సాగనుంది. ఇందుకు సంంధించిన ప్రోమో వచ్చింది.

గేమ్ ఇదే

ముందుగా ఈ గేమ్ గురించి బిగ్‍బాస్ వివరించటంతో ఈ రెండో ప్రోమో మొదలైంది. “ఇది 2050వ సంవత్సరం. ఇప్పుడు ప్రపంచమంతా ఓవర్ స్మార్ట్‌గా మారిపోయింది. ఇంతకు ముందు భూమల కోసం, ఆస్తుల కోసం గొడవలు జరిగేవి. ఈ 2050వ సంవత్సరంలో ఒకరితో మరొకరు చార్జ్ అయ్యే వరకు గొడవ పడడమే ఓవర్ స్మార్ట్ లోకం నైజం” అని బిగ్‍బాస్ చెప్పారు.

ఇంటిని ఆధీనంలోకి తీసుకున్న ‘ఓవర్ స్మార్ట్ ఫోన్లు’గా రాయల్స్ క్లాన్‍ను బిగ్‍బాస్ నియమించారు. అయితే, గత సీజన్‍లో ఆడిన అవినాశ్‍కు ఈ గేమ్ తెలుసని నిఖిల్ తన ఓజీ క్లాన్ సభ్యులతో చెప్పారు. ఫుడ్ తీసుకెళ్లవద్దని ముందే చెబుదామని రాయల్ క్లాన్ మహబూబ్ అన్నారు.

గార్డెన్ ఏరియాను ఆధీనంలోకి తీసుకున్న ‘ఓవర్ స్మార్ట్ చార్జర్స్‌’గా ఓజీ క్లాన్ సభ్యులు ఉంటారని బిగ్‍బాస్ చెప్పారు. గార్డెన్ ఏరియా తమది అని, ఇక్కడికి రావొద్దని రాయల్ క్లాన్ సభ్యులతో ఓజీ క్లాన్ మెంబర్స్ చెప్పారు.

చార్జింగ్ కోసం కొట్లాట

ఓవర్ స్మార్ట్ ఫోన్ల చార్జింగ్ సమయానుసారం తగ్గుతుందని బిగ్‍బాస్ చెప్పారు. అప్పట్లో డోర్ వేసుకొని అమ్మాయితో చార్జింగ్ పెట్టుకొని గెలిచారని తన క్లాన్ సభ్యులకు నిఖిల్ గుర్తు చేశారు. ఇక, ఓజీ క్లాన్ సభ్యుల నుంచి చార్జింగ్ పెట్టుకునేందుకు రాయల్ క్లాన్ మెంబర్స్ ప్రయత్నించాలి. వారు అడ్డుకోవాలి. ఇలా ఈ గేమ్ ఇంట్రెస్టింగ్‍గా ఉండనుంది.

మనం డీల్ చేసుకుందామని విష్ణుతో హరితేజ అన్నారు. ఏం కావాలో నువ్వు కూడా అడుగు అని విష్ణుతో నిఖిల్ చెప్పారు. దీంతో ఏం కావాలాన్న ఇస్తా అంటూ ఆఫర్లు ఇచ్చారు హరితేజ.

ఓజీ క్లాన్ నుంచి చార్జింగ్‍ను ఇంటిలోని ఇచ్చైనా.. లేకపోతే సొంత తెలివితేటలను వాడి అయినా పొందొచ్చని బిగ్‍బాస్ చెప్పారు. ఈ గేమ్ క్రమంలో తేజను ఓజీ క్లాన్ సభ్యులు వెంబడించారు.

నబీల్ కళ్లుగప్పిన అవినాశ్

ఓజీ క్లాన్ నబీల్ అలా కూర్చొని ఉంటే.. రాయల్ క్లాన్ సభ్యుడు అవినాశ్ వెనుక నుంచి అతడి కళ్లు కప్పి చార్జ్ చేసుకున్నారు. నబీల్ దగ్గర ఉన్న వైర్‌కు తన వైర్ తగిలించారు. నబీల్ మాత్రం ఏమరపాటుగానే ఉన్నారు. అయితే, అప్పుడు వెనకాల చూడు అంటూ నిఖిల్ అరిచారు. నబీల్.. నబీల్ అంటూ బిగ్‍బాస్‍కు అవినాశ్ చెప్పారు. ఈ గేమ్ ఎలా సాగిందో.. ఓ క్లాన్ గెలిచిందో నేటి ఎపిసోడ్‍లో తేలనుంది.

అమ్మ కోసం తాను తన తండ్రితో మాట్లాడడం లేదని గంగవ్వతో విష్ణు చెప్పుకోవడం నేటి తొలి ప్రోమోలో ఉంది. దీంతో గంగవ్వ కన్నీరు పెట్టుకున్నారు. ఈ వారం తాను సేవ్ అయితే బంగారు ముక్కు పుడక చేయిస్తానని గంగవ్వతో మణి సరదాగా చెప్పారు. తనకు బంగారు వడ్డాణం ఇస్తావా అని హరితేజ అడిగారు. నాకేమిస్తావని రోహిణి.. అడిగితే ముద్దిస్తానంటూ మణి జోక్ చేశారు. నామినేషన్ల గొడవలను కంటెస్టెంట్లు రీక్రియేట్ చేస్తూ సరదాగా సాగింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024