Best Web Hosting Provider In India 2024
OTT Horror Comedy: హారర్ కామెడీ జానర్ మూవీస్ ఇష్టపడే వారి కోసం మరో సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ ఇంగ్లిష్ మూవీ పేరు కార్వ్డ్ (Carved). 2018లో ఓ షార్ట్ ఫిల్మ్ గా వచ్చిన ఈ మూవీని ఇప్పుడు పూర్తిస్థాయి ఫీచర్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జస్టిన్ హార్డింగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తోంది.
గుమ్మడికాయ పగబడితే..
హాలోవీన్ తెలుసు కదా. పాశ్చాత్య దేశాల్లో ప్రతి ఏటా అక్టోబర్ 31న జరుపుకునే రోజు ఇది. ఆ రోజు చాలా మంది వెరైటీ కాస్ట్యూమ్స్ వేసుకొని కనిపిస్తారు. క్రిస్టియన్లకు ఎంతో పవిత్రమైన ఆల్ సెయింట్స్ డే జరుపుకోవడానికి ఒక రోజు ముందు ఈ హాలోవీన్ జరుపుకుంటారు. ఇప్పుడా డే థీమ్ తో కార్వ్డ్ అనే హారర్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చింది.
ఈ సినిమా సోమవారం (అక్టోబర్ 21) నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఇదే పేరుతో 2018లో ఓ షార్ట్ ఫిల్మ్ వచ్చింది. ఇప్పుడు దానిని పూర్తి స్థాయిలో ఓ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఓ గుమ్మడికాయ పగబట్టడం, మనుషులను చంపడం అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ ఇది.
కార్వ్డ్ మూవీ స్టోరీ ఏంటంటే?
కార్వ్డ్ సినిమా హాలోవీన్ రోజు ఓ ఊళ్లో చిక్కుకుపోయిన కొందరు వ్యక్తులు, వాళ్లను చంపడానికి ప్రయత్నించే ఓ గుమ్మడికాయ చుట్టూ తిరుగుతుంది. ఆ వ్యక్తులు హాలోవీన్ రోజు ఓ గుమ్మడికాయను కట్ చేయడానికి ప్రయత్నిస్తారు.
కానీ అది సడెన్ గా వాళ్లనే చంపడం మొదలుపెడుతుంది. తన తీగలతో వాళ్లను చుట్టేసి ఊపిరాడకుండా చేయడం, వాళ్ల గొంతులు కోసేయడం.. ఇలా ఆ గుమ్మడికాయ చాలా వయోలెంట్ గా మారిపోతుంది. నవ్విస్తూనే వణుకు పుట్టించే ఈ హారర్ కామెడీ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
రోటెన్ టొమాటోస్ లాంటి రేటింగ్ ప్లాట్ఫామ్స్ పై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. అసలు ఆ గుమ్మడి కాయ కథేంటి? అది ఎందుకంత హింసాత్మకంగా మారి మనుషులను చంపుతుంది? అక్కడికి వెళ్లిన వాళ్లు ఎలా తప్పించుకుంటారన్నది ఈ సినిమాలో చూడొచ్చు. హాలోవీన్ జరుపుకోవడానికి పది రోజుల ముందు ఓటీటీలోకి వచ్చిన ఈ హారర్ కామెడీ మూవీ కార్వ్డ్ ఆ జానర్ సినిమాలను ఇష్టపడే వారిని మెప్పిస్తుంది.
Best Web Hosting Provider In India 2024
Source / Credits