Crime Thriller OTT: ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వస్తున్న డిజాస్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..

Best Web Hosting Provider In India 2024

Crime Thriller OTT: క్రైమ్ థ్రిల్లర్ కు మర్డర్ మిస్టరీ తోడైతే ఆ జానర్ మూవీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. కానీ సెప్టెంబర్ లో రిలీజైన బాలీవుడ్ మూవీ ది బకింగ్‌హామ్ మర్డర్స్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఎన్నో హిట్ సినిమాలు, స్కామ్ 1992లాంటి హిట్ వెబ్ సిరీస్ రూపొందించిన హన్సల్ మెహతా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది.

ది బకింగ్‌హామ్ మర్డర్స్ ఓటీటీ రిలీజ్ డేట్

బాలీవుడ్ నటి కరీనా కపూర్ లీడ్ రోల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది బకింగ్‌హామ్ మర్డర్స్. ఈ సినిమా సెప్టెంబర్ 14న థియేటర్లలో రిలీజైంది. సుమారు రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.15 కోట్లు మాత్రమే వచ్చాయి. అలాంటి మూవీ ఇప్పుడు నవంబర్ 8 నుంచి నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది.

ఇందులో కరీనా కపూర్ ఓ డిటెక్టివ్ పాత్రలో నటించింది. నిజానికి ఐఎండీబీతోపాటు రివ్యూల్లోనూ పాజిటివ్ టాకే వచ్చినా.. ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లలో మాత్రం చాలా వెనుకబడి పోయింది. అయితే క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీస్ ను బాగా ఆదరించే ఓటీటీల్లో మాత్రం ది బకింగ్‌హామ్ మర్డర్స్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ది బకింగ్‌హామ్ మర్డర్స్ స్టోరీ ఏంటంటే?

ది బకింగ్‌హామ్ మర్డర్స్ కేవలం గంటన్నర నిడివితో వచ్చిన మూవీ కావడం విశేషం. అయితే ఆ కాస్త టైమ్ లోనే కథనం నెమ్మదిగా సాగడమే ప్రేక్షకులను అసహనానికి గురి చేసింది. అయితే అక్కడక్కడా థ్రిల్ అందిస్తూ సీట్లకు అతుక్కుపోయేలా చేసింది. ఈ మూవీ జస్మీత్ భామ్రా (కరీనా కపూర్) అనే ఓ డిటెక్టివ్ చుట్టూ తిరుగుతుంది.

తన కొడుకును కోల్పోయిన బాధలో ఉన్న ఆమె తన ఊరు వదిలి వెళ్లి మరో చోట ఓ పదేళ్ల పిల్లవాడి హత్య కేసును పరిష్కరించే పనిలో ఉంటుంది. మొదట్లో మిస్సింగ్ కేసుగా మొదలై తర్వాత ఆ పిల్లాడు హత్యకు గురయ్యాడని తేలడంతో ఇంటెన్స్ గా మారుతుంది. అతన్ని చంపింది ఎవరు? ఆ హత్యకు అసలు కారణం ఏంటి అన్నది మూవీలోనే చూడాలి.

ఈ సినిమాను బ్రిటన్ లోని బకింగ్‌హామ్‌షైర్ లో చిత్రీకరించారు. మొదట్లోనే లీడ్ రోల్ తన కొడుకును కోల్పోయిన బాధలో ఉన్నట్లుగా చూపించేసి ఆ తర్వాత సినిమా మొత్తాన్ని పిల్లాడి మిస్సింగ్, హత్య కేసు చుట్టే నడిపించారు.

2022లో లీసెస్టర్ లో హిందూ, ముస్లిం గొడవలు.. ఇండియా, పాకిస్థాన్ ఏషియా క్రికెట్ కప్ లతో ఈ కేసును మొదలుపెట్టారు. ది బకింగ్‌హామ్ మర్డర్స్ మూవీకి కరీనా కపూరే బలమని చెప్పొచ్చు. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడీ సినిమా నవంబర్ 8 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024