Bigg Boss Telugu 8: ఇక నుంచి హౌజ్‌లో ఒక్కటే మెగా టీమ్.. సంచాలక్‌గా గంగవ్వ.. బీబీ ఇంటికి దారేది టాస్క్ (వీడియో)

Best Web Hosting Provider In India 2024

Bigg Boss Telugu 8 Today Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 29 ఎపిసోడ్‌లో రెండు క్లాన్స్ ఒక్కటి అయిపోయాయి. ఇప్పటివరకు బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌ అయిన రాయల్ క్లాన్, సీజన్ ప్రారంభంలో వచ్చిన కంటెస్టెంట్స్‌తో ఉన్న ఓజీ క్లాన్ అని రెండు టీమ్స్ ఉండేవి.

ఒకే ఒక్క మెగా క్లాన్

ఇప్పుడు ఆ రెండు టీమ్స్ తీసేసి ఒక్కటే క్లాన్‌గా చేస్తున్నట్లు బిగ్ బాస్ తాజాగా అనౌన్స్ చేశాడు. దీనికి సంబంధించన ఎపిసోడ్ ఇవాళ (మంగళవారం) ప్రసారం కానుంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 29 ఎపిసోడ్ ప్రోమో వీడియోను విడుదల చేశారు మేకర్స్. “బిగ్ బాస్‌లో మీ ప్రయాణం మూడు క్లాన్స్‌గా మొదలైంది. ఇప్పటి నుంచి ఉండబోయేది ఒకే ఒక్క మెగా క్లాన్. అదే బీబీ క్లాన్” అని బిగ్ బాస్ చెప్పాడు.

టీమ్‌కు ముగ్గురు

దాంతో కంటెస్టెంట్స్ అంతా అరుస్తూ చప్పట్లు కొట్టారు. అనంతరం “బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ బీబీ ఇంటికి దారేది. ఈ ఛాలెంజ్‌లో గెలవడానికి మీరు గెలవడానికి మీరు చేయాల్సిందల్లా మీ ముందున్న వివిధ పాట్స్‌ను ఉపయోగించి మీకు సంబంధించిన స్నో మ్యాన్‌ను పూర్తి చేయడం” అని బిగ్ బాస్ చెప్పాడు. ఈ ఛాలెంజ్‌కు ఒక్కో టీమ్‌లో ముగ్గురు చొప్పున నాలుగు టీమ్స్ అయ్యాయి.

సంచాలక్‌గా గంగవ్వ

రెండ్, గ్రీన్, బ్లూ, యెల్లో టీమ్స్ బీబీ ఇంటికి దారేది టాస్క్ ఆడాయి. ఈ టాస్క్‌కు సంచాలక్‌గా గంగవ్వ వ్యవహరించింది. అయితే, ఈ టాస్క్‌లో స్కేటింగ్ లాగా ఉండేవాటిపై టీమ్ మెంబర్స్ అంతా నిలబడి ఫాస్ట్‌గా వివిధ భాగాలు కలెక్ట్ చేసి స్నో మ్యాన్ బొమ్మను రెడీ చేయాలి. నాలుగు టీమ్స్ పోటా పోటీగా తలపడ్డాయి. ఈ క్రమంలో గ్రీన్ టీమ్ అయిన తేజ, నబీల్, విష్ణుప్రియ కిందపడిపోయారు.

యెల్లో కార్డ్ ఎఫెక్ట్

తర్వాత బజర్ మోగింది. అప్పుడు గంగవ్వ విన్నర్ ఎవరు అని బిగ్ బాస్ అడిగాడు. హరితేజ బ్లూ టీమ్ అని గంగవ్వ చెప్పింది. దాంతో “స్టోర్ రూమ్‌లో ఉన్న యెల్లో కార్డ్‌ను ఏ టీమ్‌కు ఇవ్వాలనుకుంటున్నారో వారికి ఇచ్చేయండి” అని బిగ్ బాస్ చెప్పాడు. హరితేజ ఏ టీమ్‌కు ఇస్తుందో అనే సస్పెన్స్‌తో బిగ్ బాస్ 8 తెలుగు అక్టోబర్ 29 ఎపిసోడ్ ప్రోమో వీడియోను ముగించారు.

తొమ్మిదో వారం నామినేషన్స్

అయితే, బ్లూ టీమ్ ఆ యెల్లో కార్డ్‌ను రెడ్ టీమ్‌కి ఇచ్చినట్లు సమాచారం. రెడ్ టీమ్‌లో గౌతమ్, యష్మీ, ప్రేరణ ఉన్నారు. ఆ యెల్లో కార్డ్ అర్థం మిగతా టీమ్‌ను డేంజర్‌లో పడేయడమని తెలుస్తోంది. రెడ్ టీమ్‌కు బ్లూ టీమ్ యెల్లో కార్డ్ ఇవ్వడంతో ఆ ముగ్గురు డేంజర్‌లో పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ తెలుగు 8 తొమ్మిదో వారం నామినేషన్స్ రచ్చ రచ్చగానే సాగాయి.

ఈ వారం నామినేషన్స్‌లో

ఒకరోజు మాత్రమే జరిగిన బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్‌లో ఐదుగురు ఉన్నారు. గౌతమ్, నయని పావని, హరితేజ, యష్మీ గౌడ, టేస్టీ తేజ ఐదుగురు బిగ్ బాస్ 8 తెలుగు 9వ వారం నామినేట్ అయ్యారు. వీరికి నిన్నటి నుంచే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024