
Best Web Hosting Provider In India 2024

తండేల్ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే టెన్షన్ కొనసాగుతోంది. షూటింగ్ దాదాపు తుదిదశకు వచ్చినా ఇంకా రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ ఖరారు చేయలేదు. ఈ చిత్రంలో యువ సామ్రాట్ నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. మత్స్యకారుడిగా చైతూ నటిస్తున్న ఈ చిత్రం హైప్ బాగా ఉంది. అయితే, రిలీజ్ ఎప్పుడా అనే సందేహం ఉంది. ఈ విషయంపై తాజాగా ఓ మూవీ ఈవెంట్‍లో డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడారు.
ఆ ఇద్దరి నిర్ణయంపై..
తండేల్ మూవీని సంక్రాంతికే రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నట్టు చందూ మొండేటి చెప్పారు. అయితే, రామ్‍చరణ్ ‘గేమ్ ఛేంజర్’ వస్తుందని నిర్మాత అల్లు అరవింద్ అనుకున్నా.. తన మామ వెంకటేశ్ సినిమా వస్తుందని నాగచైతన్య ఆలోచించినా తండేల్ సంక్రాంతి నుంచి వాయిదా పడుతుందనేలా చందూ వెల్లడించారు.
రహస్యం ఇదమ్ జగత్ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍కు చందూ మొండేటి నేడు (అక్టోబర్ 29) గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తండేల్ రిలీజ్ గురించి మాట్లాడారు. “మనం అయితే జనవరికి రెడీగా ఉంటాం. షూటింగ్ పూర్తయ్యేందుకు 10 రోజులే ఉంది. చరణ్ సినిమా వస్తుందని అరవింద్, వెంకీ మామ సినిమా వస్తుందని చైతూ ఆలోచిస్తే మాత్రం వెనక్కి వెళ్లవచ్చు” అని చందూ మొండేటి చెప్పారు.
అప్పటికి రెడీ కాదు
డిసెంబర్ 25వ తేదీకి రిలీజ్ చేయవచ్చు కదా అనే ప్రశ్న చందూకు ఎదురైంది. అయితే అప్పటికి సినిమా పూర్తిగా సిద్ధమవదని చెప్పారు. ఒకవేళ ముందే ఆ డేట్ అనుకొని ఉంటే ప్లాన్ చేసుకొని ఉండే వాళ్లమని, కానీ తాము ముందు నుంచి సంక్రాంతి అని భావించామని తెలిపారు. డిసెంబర్ 25కు తండేల్ రాదని చెప్పారు.
తండేల్ మూవీని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ప్రొడ్యూజ్ చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. రామ్‍చరణ్ హీరోగా ఉన్న గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీని లాక్ చేసుకుంది. విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‍లో రానున్న మూవీ కూడా సంక్రాంతికే షెడ్యూల్ అయింది. దీంతో తండేల్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తండేల్ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేసే అవకాశం ఉందా అనే ప్రశ్న కూడా చందూ మొండేటికి వచ్చింది. అయితే, ఎటూ కాకుండా జనవరి 26 ఆదివారం వచ్చినందుకు కష్టమేనని అన్నారు. మరి సంక్రాంతి నుంచి తండేల్ వాయిదా పడితే మరి ఎప్పుడు వస్తుందో చూడాలి.
తండేల్ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ అంచనాలను పెంచేసింది. పాకిస్థాన్ చెరలో కొన్ని నెలల పాటు బందీలుగా చిత్రహింసలు అనుభవించి భారత్‍కు తిరిగి వచ్చిన శ్రీకాకుళం మత్స్యకారుల కథ ఆధారంగా తండేల్ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం విడుదల కానుంది.