Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్, విశాఖ మార్గంలో ఐదు స్పెషల్ రైళ్లు అందుబాటులోకి

Best Web Hosting Provider In India 2024

ప్రయాణికులకు ఈస్ట్‌కోస్ట్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఐదు వేర్వేరు మార్గాల్లో ఐదు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల రద్దీని క్లియర్ చేయడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం-భువనేశ్వర్-విశాఖపట్నం మధ్య అన్‌రిజర్వ్డ్ జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లు, విశాఖపట్నం- దానాపూర్- విశాఖపట్నం మ‌ధ్య ప్రత్యేక రైళ్ల, సంత్రాగచ్చి -జీఎంఆర్‌ చెన్నై సెంట్రల్ మధ్య ప్రత్యేక రైలును నడపాలని నిర్ణయించింది.

విశాఖపట్నం-భువనేశ్వర్-విశాఖపట్నం మధ్య జన్ సాధారణ్ ప్రత్యేక రైలు

1. విశాఖపట్నం – భువనేశ్వర్ జన్ సాధారణ్ ప్రత్యేక (08536) రైలు విశాఖపట్నం నుండి న‌వంబర్ 15 (ప్రతిరోజు) మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరుతుంది. ఇది సింహాచలం మ‌ధ్యాహ్నం 12:15 గంట‌ల‌కు, కొత్తవలస మ‌ధ్యాహ్నం 12:30 గంట‌లకు, విజయనగరం మ‌ధ్యాహ్నం 1 గంట‌కు, చీపురుపల్లి మ‌ధ్యాహ్నం 1:32 గంటలకు, పొందూరు మ‌ధ్యాహ్నం 1:52 గంట‌ల‌కు, శ్రీకాకుళం రోడ్డు మ‌ధ్యాహ్నం 2:08 గంట‌ల‌కు చేరుకుని, రాత్రి 7:45 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.

2. భువనేశ్వర్ – విశాఖపట్నం జన్ సాధారణ్ ప్రత్యేక (08535) రైలు న‌వంబ‌ర్ 15 ప్రతి రోజూ రాత్రి 8:30 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి మరుసటి రోజు తెల్ల‌వారు జామున 4:40 గంటలకు నౌపడ చేరుకుంటుంది. శ్రీకాకుళం రోడ్డు ఉద‌యం 5:13 గంటల‌కు, పొందూరు ఉద‌యం 5:28 గంట‌ల‌కు, చీపురుపల్లి ఉద‌యం 5:48 గంట‌ల‌కు, విజయనగరం ఉద‌యం 6:15 గంట‌ల‌కు, కొత్తవలస ఉద‌యం 6:45 గంట‌ల‌కు, సింహాచలం ఉద‌యం 7:08 గంటలకు, ఉద‌యం 8:45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళం రోడ్డు, నౌపడ, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం, బ్రహ్మాపూర్, ఛత్రపూర్, బాలుగావ్, ఖుర్దా రోడ్డు స్టేష‌న్లలో స్టాప్ ఉంది. ఈ రైళ్ల‌కు జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు-10, సెకండ్ క్లాస్ కమ్ దివ్యాంగజన్ కోచ్ -1, మోటార్ కార్-1 కోచ్‌లు ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని వాల్తేర్ డివిజ‌న్ ఎస్‌డీసీఎం కె.సందీప్ కోరారు.

విశాఖపట్నం-దానాపూర్-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలు

1. విశాఖపట్నం – దానాపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08520) రైలు విశాఖపట్నం నుండి న‌వంబ‌ర్ 4 (సోమవారం) ఉద‌యం 9:10 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు సింహాచలం ఉద‌యం 9:25 గంట‌ల‌కు, విజయనగరం ఉద‌యం 10 గంట‌కు, శ్రీకాకుళం రోడ్డు గంట‌ల‌కు 11 గంట‌ల‌కు చేరుకుంటుంది. మంగ‌ళ‌వారం ఉదయం 11 గంటలకు దానాపూర్‌ చేరుకుంటుంది.

2. దానాపూర్-విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08519) రైలు న‌వంబ‌ర్ 5 (మంగళవారం) మ‌ధ్యాహ్నం 12:30 గంటలకు దానాపూర్‌లో బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు (బుధ‌వారం) మ‌ధ్యాహ్నం 12:55 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు, విజయనగరం మ‌ధ్యాహ్నం 1:55 గంటలకు, సింహాచలం మ‌ధ్యాహ్నం 2:40 గంటలకు, విశాఖ‌ప‌ట్నం మ‌ధ్యాహ్నం 3:45 గంటలకు చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు విశాఖపట్నం నుండి ధనపూర్ మధ్య సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, బాలుగావ్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జజ్‌పుర్‌కియోంజర్ రోడ్, భద్రక్, బాలాసోర్, హిజ్లీ, మిడ్నాపూర్, బంకురా, అద్రా, అస్న్సోల్, చిత్తరంజన్, మధుపూర్, జసిది రైల్వే స్టేష‌న్లలో స్టాపేజ్‌లు ఉన్నాయి. ఈ రెండు రైళ్లకు థ‌ర్డ్‌ ఏసీ కోచ్‌లు-2, స్లీపర్ క్లాస్ కోచ్‌లు-12, జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు-5; సెకండ్ క్లాస్ కమ్ దివ్యాంగజన్ కోచ్ -2 ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని వాల్తేర్ డివిజ‌న్ ఎస్‌డీసీఎం కె.సందీప్ కోరారు.

సంత్రాగచ్చి -జీఎంఆర్‌ చెన్నై సెంట్రల్ మధ్య ప్రత్యేక రైలు

సంత్రాగచ్చి – జీఎంఆర్‌ చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06134) రైలు అక్టోబ‌ర్ 30 (బుధవారం) సంత్రాగచ్చి నుండి ఉద‌యం 10:10 గంటలకు బయలుదేరుతుంది. ఇది శ్రీకాకుళం రోడ్‌కి రాత్రి 11:30 గంటలకు, విజయనగరం అర్ధరాత్రి 12:25 గంటలకు, దువ్వాడలో అర్థరాత్రి 1:50 గంటలకు చేరుకుని, గురువారం మ‌ధ్యాహ్నం 3:30 గంటలకు ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది.

ఈ రైలుకు సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, బ్రహ్మాపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, ఖరగ్‌పూర్ స్టాప్‌లు ఉన్నాయి. ఈ రైలుకు థ‌ర్డ్‌ ఏసీ క్లాస్ కోచ్-1, స్లీపర్ క్లాస్ కోచ్‌లు -8, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు-10, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/దివ్యాంగజన్ కోచ్‌లు-2 ఉన్నాయి. ఈ ప్రత్యేక రైలు సేవలను ప్రజలు వినియోగించుకోవాలని వాల్తేర్ డివిజ‌న్ ఎస్‌డీసీఎం కె.సందీప్ కోరారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

TrainsSpecial TrainsVisakhapatnamAndhra Pradesh NewsTrending ApTelugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024