Best Web Hosting Provider In India 2024
PM Modi: 500 ఏళ్లలో తొలిసారిగా శ్రీరాముడు అయోధ్య ఆలయంలో దీపావళి పండుగను జరుపుకుంటున్నందు ఈ ఏడాది దీపావళి చాలా ప్రత్యేకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ ధంతేరాస్ (dhanteras) శుభాకాంక్షలు తెలిపారు.
ఇది ప్రత్యేక దీపావళి
‘‘దేశ ప్రజలందరికీ ధంతేరాస్ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరో రెండు రోజుల్లో మనం కూడా దీపావళి జరుపుకుంటాం. ఈ ఏడాది దీపావళికి ఎంతో ప్రత్యేకత ఉంది. 500 సంవత్సరాల తరువాత, శ్రీరాముడు అయోధ్యలోని తన ఆలయంలో ఉన్నాడు. తన అద్భుతమైన ఆలయంలో శ్రీరాముడు జరుపుకుంటున్న మొదటి దీపావళి ఇది. ఇంత ప్రత్యేకమైన, ఘనమైన దీపావళిని చూడటం మనందరి అదృష్టం’’ అని ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పేర్కొన్నారు. 2019లో అయోధ్య లోని వివాదాస్పద భూమిని హిందూ పక్షానికి ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో వేరే ప్రాంతంలో స్థలాన్ని కేటాయించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జనవరి లో ఆలయం ప్రారంభం
అయోధ్య రామ మందిరాన్ని ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. అందువల్ల ఈ ఆలయానికి ఇదే తొలి దీపావళి. అయోధ్య (AYODHYA) లో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి వ్యాపార దిగ్గజాలు, బాలీవుడ్ నటులు, క్రికెటర్లతో సహా వేలాది మంది ప్రముఖులు హాజరయ్యారు. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ( ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉపాధి మేళాలో యువతకు ఉద్యోగ నియామక పత్రాలు
ఈ సందర్భంగా 51 వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను మోదీ అందజేశారు. ఈ సందర్భంగా వారికి ప్రధాని మోదీ (narendra modi) అభినందనలు తెలిపారు. ‘‘మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. దేశంలోని లక్షలాది మంది యువతకు భారత ప్రభుత్వంలో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది. బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో కూడా లక్షలాది మంది యువతకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చాం’’ అని చెప్పారు. హరియాణా ప్రభుత్వంలో అపాయింట్ మెంట్ లెటర్స్ అందుకున్న యువతను ప్రధాని అభినందించారు.
Best Web Hosting Provider In India 2024
Source link