OTT Suspense Thriller: నెల రోజుల్లోపే మరో ఓటీటీలోకీ వచ్చేస్తున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ..

Best Web Hosting Provider In India 2024

OTT Suspense Thriller: మిగతా భాషలతో పోలిస్తే తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కే సినిమాలు అరుదుగానే వస్తుంటాయి. అలా వచ్చిన సినిమాయే కలి. అక్టోబర్ 4న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పటికే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. కేవలం రెండు వారాల్లోనే డిజిటల్ ప్రీమియర్ అయింది. అయితే ఇప్పుడు మరో ఓటీటీలోకి కూడా ఈ మూవీ రాబోతోంది.

కలి ఓటీటీ స్ట్రీమింగ్

సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కలి (Kali). ఇప్పుడీ సినిమా అక్టోబర్ 31 నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కు వస్తోంది. “మీరు భయాన్ని తట్టుకోగలరా? కలి మూవీ ప్రీమియర్ అక్టోబర్ 31న” అనే క్యాప్షన్ తో ఆహా వీడియో ఎక్స్ అకౌంట్ ఈ విషయాన్ని వెల్లడించింది.

అక్టోబర్ 4న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. అక్టోబర్ 17నే ఈటీవీ విన్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. మరో రెండు వారాల తర్వాత ఇప్పుడు రెండో ఓటీటీలోకి కూడా స్ట్రీమింగ్ కు రానుండటం విశేషం. యంగ్ హీరోలు ప్రిన్స్ సిసిల్, నరేష్ అగస్త్య నటించిన కలి సినిమాకు శివ శేషు దర్శకత్వం వహించాడు.

కలి మూవీ ఎలా ఉందంటే?

కలి మూవీ తన కుటుంబానికి దూరమై ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్న శివరామ్ (ప్రిన్స్) అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతని ఇంటికి అనుకోకుండా ఓ రోజు ఓ అపరిచిత వ్యక్తి (నరేష్ అగస్త్య) వస్తాడు.

అతడు వచ్చిన తర్వాత శివరామ్ జీవితం ఎలాంటి మలుపు తిరగబోతోంది అన్నదే ఈ మూవీ స్టోరీ. అసలు సమాజంలో మంచి వాడుగా పేరు సంపాదించిన శివరామ్ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చివరికి అతని జీవితంలో ఏం జరగబోతోంది అన్నది కలి మూవీ చూస్తే తెలుస్తుంది. ప్రముఖ కథా రచయిత కె. రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై కలి మూవీని నిర్మించారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరించారు.

నిజానికి ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే తీసుకురావాలని భావించినా.. తర్వాత మనసు మార్చుకొని అక్టోబర్ 4న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాకముందే అక్టోబర్లోనే తమ ప్లాట్‌ఫామ్ లో రాబోతోందని గత నెలలోనే ఈటీవీ విన్ ఓటీటీ వెల్లడించింది. అయితే ఇప్పుడు ఆహా వీడియో కూడా ఈ కలి సినిమాను స్ట్రీమింగ్ చేయబోతుండటం విశేషం.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024