Best Web Hosting Provider In India 2024

అన్ని వర్గాల ప్రజలపైనా దాడులు.
బహిరంగంగా ఉద్యోగులపై బెదిరింపులు.
కూటమి పాలనపై వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి శివశంకర్ ధ్వజం.
బెదిరింపులకు దిగిన టీడీపీ అధికార ప్రతినిధిపై పోలీసులు సుమోటుగా కేసు నమోదు చేయాలి.
వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి శివశంకర్ డిమాండ్.
తాడేపల్లి: టీడీపీ నేతలు చెప్పినట్లు పని చేయకపోతే, సచివాలయ ఉద్యోగికి గూబ పగులగొట్టండని ఆ పార్టీ అధికార ప్రతినిధి బహిరంగంగా ఉద్యోగులను బెదిరించడంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు దాడి చేయండి… పోలీసోడు ఎవడు వస్తాడో చూద్దాం అని మాట్లాడుతున్నారంటే… … అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. కూటమి పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో దౌర్జన్య కాండ కొనసాగుతోందని ఆగ్రహించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజల మీద, వైయస్ఆర్‌సీపీ కార్యకర్తల మీద, ఓటు, వేయని వారి మీద దౌర్జన్యాలు, హింసలు నిత్యం పరిపాటిగా మారాయని ఆందోళన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్నది రెడ్ బుక్ రాజ్యాంగమా?.. చంద్రబాబు రాజ్యాంగమా?, పవన్ రాజ్యాంగమా?, కర్జూర నాయుడు రాజ్యాంగమా? అని నిలదీసారు.
తునిలో ఓ బస్సు డ్రైవర్ డ్యాన్స్ వేస్తే, అమెరికా నుంచి స్పందించిన లోకేశ్… బాధ్యాతయుతమైన విధుల్లో ఉన్న సచివాలయ ఉద్యోగులను తమ పార్టీ నేత బెదిరిస్తే ఎందుకు స్పందించరని నిలదీశారు. పోలీసులు సుమోటోగా తీసుకుని సచివాలయ ఉద్యోగులను బెదిరించిన టీడీపీ అధికార ప్రతినిధిపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. సచివాలయ ఉద్యోగాలకు అండగా ఉండటమే కాకుండా న్యాయం చేసే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాడుతుందని శివశంకర్ రెడ్డి స్పష్టం చేసారు.