Best Web Hosting Provider In India 2024
OTT Telugu Movies This Week: ఓటీటీలో ఈ వారం కుప్పలుతెప్పలుగా సినిమాలు, వెబ్ సిరీసులు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. వాటిలో ఒక్క తెలుగు భాషలో 12 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో కూడా 3 స్ట్రైట్ తెలుగు సినిమాలు ఉంటే, 9 ఇతర భాషల్లోని తెలుగు డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి. మరి అవేంటీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఓ లుక్కేద్దాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
హిట్లర్ (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 30
విశ్వం (తెలుగు యాక్షన్ కామెడీ చిత్రం)- నవంబర్ 1
స్ట్రేంజ్ డార్లింగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ సస్పెన్స్ మూవీ)- నవంబర్ 1
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
హార్ట్ బీట్ (తెలుగు డబ్బింగ్ తమిళ మెడికల్ లవ్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
లబ్బర్ పందు (తెలుగు డబ్బింగ్ తమిళ స్టోర్ట్స్ డ్రామా సినిమా)- అక్టోబర్ 31
కిష్కింద కాండం (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం)- నవంబర్ 1
ఆహా ఓటీటీ
అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 (రొమాంటిక్ అండ్ బోల్డ్ తెలుగు వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
ఆపరేషన్ రావణ్ (తెలుగు సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 2
లవ్ మాక్‌టైల్ 2 (తెలుగు డబ్బింగ్ కన్నడ చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- అక్టోబర్ 31
ది వైల్డ్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ క్రైమ్ యాక్షన్ మూవీ)- జియో సినిమా ఓటీటీ- అక్టోబర్ 31
టైమ్ కట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ టైమ్ ట్రావెల్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం)- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ- అక్టోబర్ 31
మిథ్య ది డార్క్ చాప్టర్ (తెలుగు డబ్బింగ్ హిందీ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- నవంబర్ 1
డిఫరెంట్ జోనర్స్
వీటిలో యాక్షన్ కామెడీ, హారర్ సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్, లవ్-రొమాంటిక్ అండ్ బోల్డ్, సైకలాజికల్ థ్రిల్లర్ వంటి జోనర్స్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. అలాగే, ఈ వారం తెలుగులో నేరుగా వచ్చిన రొమాంటిక్ బోల్డ్ వెబ్ సిరీస్ అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2తోపాటు మిథ్య 2, మెడికల్ రొమాంటిక్ థ్రిల్లర్ హార్ట్ బీట్ మూడు వెబ్ సిరీసులే ఉన్నాయి. మిగతా 9 సినిమాలే ఉన్నాయి.
విశ్వం ఓటీటీ
వీటిలో గోపీచంద్-శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ కామెడీ సినిమా విశ్వం మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వునుంది. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్గా యాక్ట్ చేసింది.
అర్థమైందా అరుణ్ కుమార్ 2 ఓటీటీ
తేజస్వి మదివాడ, పవన్ సిద్ధు, అనన్య శర్మ ప్రధాన పాత్రలు పోషించిన రొమాంటిక్ తెలుగు స్ట్రైట్ వెబ్ సిరీస్ అర్థమైందా అరుణ్ కుమార్. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుందో కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా చిత్రీకరించారు.
ఆపరేషన్ రావణ్ ఓటీటీ
పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా చేసిన సైకో, క్రైమ్ థ్రిల్లర్ తెలుగు స్ట్రైట్ మూవీ ఆపరేషన్ రావణ్. ఇందులో సంగీర్తన విపిన్ హీరోయిన్గా చేయగా సీనియర్ కథానాయికగా రాధికా శరత్ కుమార్ కీ రోల్ ప్లే చేశారు. ఈ 12 వాటిల్లో ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు స్ట్రైట్ మూవీస్ ఇవే. వీటన్నింటిని వీకెండ్లో ఎంచక్కా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు.