Best Web Hosting Provider In India 2024
Gunde Ninda Gudi Gantalu: బాలు, ప్రభావతితో పాటు మిగిలిన కుటుంబసభ్యులకు కనిపించకుండా హాస్పిటల్‌నే ఉంటుంది మీనా. చాటుగా ఉంటూ బాలు, రవి గొడవనుచూస్తుంది. రవి, మీనాలను క్షమించేది లేదని, జీవితంలో మళ్లీ వాళ్లను తన దగ్గరకు రానివ్వనని బాలు అంటాడు.
రోహిణి బంగారం…
సత్యాన్ని ఆపరేషన్ థియేటర్లోకి డాక్టర్లు తీసుకెళతారు. ప్రభావతి గాజులు తాకట్టు పెట్టి డబ్బు తీసుకురావడానికి బాలు వెళ్లబోతాడు. అతడిని రోహిణి, మనోజ్ ఆపుతారు. తమ దగ్గర ఉన్న బంగారం ఇవ్వబోతారు. కానీ బాలు వద్దని అంటాడు. తక్కువ పడితే ఎక్కడో ఓ చోట అడ్జెస్ట్ చేస్తానని బాలు చెబుతాడు. ఇప్పటికే అమ్మ గాజులు తీసుకొని తప్పు చేశామని చెబుతాడు.
మీనా కన్నీళ్లు…
బాలుకు కనిపించకుండా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన మీనా గుడికి వెళ్తుంది. సత్యం మంచివారని, చీమకు కూడా ఆపద తలపెట్టని మంచి మనిషికి ఇలాంటి కష్టం రావడం ఏంటి? అందుకు కారణం తాను అని నిందలు పడటం ఏంటి అని దేవుడి ముందు కన్నీళ్లు పెట్టుకుంటుంది.
తండ్రి ఆపరేషన్ కోసం బాలు కారు అమ్మాడని తెలిసి ఎమోషనల్ అవుతుంది. సత్యాన్ని మామూలు మనిషిని చేసి తన కుటుంబం కన్నీళ్లను దూరం చేయమని దేవుడిని వేడుకుంటుంది. అదే గుడికి ప్రభావతి, రోహిణి రావడంతో వారికి కనిపించకుండా మీనా దాక్కుంటుంది.
ప్రభావతి ఆవేదన…
తాము ఏం పాపాలు చేశామని భర్తకు ఈ కష్టం తెప్పించావని ప్రభావతి దేవుడిని వేడుకుంటుంది. నేను ఎన్ని మాటలు అన్నా ఆయన తనను ఒక్కరోజు తిట్టలేదని, అలాంటి మంచి మనిషి ఈ స్థితిలో తాను చూడలేకపోతున్నానని ఆవేదనకు లోనవుతుంది. రవి, మీనా వల్లే సత్యం హాస్పిటల్ పాలయ్యాడని ప్రభావతి అంటుంది.
సాక్షి సంతకం చేసి రవిని ఇంటి నుంచి సాగనంపి..నట్టింట్లో నిప్పులు పోసిందని మీనాపై నిందలు వేస్తుంది. మీనా ఎప్పటికీ బాగుపడదని శాపాలు పెడుతుంది. మీకు నేనున్నానని, మనం మన ఫ్యామిలీని చక్కదిద్దుకుందామని ప్రభావతిని ఓదార్చుతుంది రోహిణి.
సత్యం సేఫ్…
ప్రభావతి, రోహిణి గుడిలో ఉండటంతో సత్యానికి తాయత్తు కట్టడానికి తిరిగి హాస్పిటల్‌కు వస్తుంది మీనా. ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని, సత్యం ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు అంటారు. ఆ మాట వినగానే బాలు, మనోజ్ ఆనందపడతారు. బాలు, మనోజ్ డాక్టర్‌తో మాట్లాడటానికి వెళ్లగానే సత్యం రూమ్ దగ్గరకు మీనా వస్తుంది. మీనాను చూసి రంగారావు కంగారుపడతాడు.
మీనా క్షమాపణలు…
మావయ్య కోసం పూజ చేసి తాయత్తు తెచ్చానని, కట్టేసి వెళ్లిపోతానని రంగారావుతో చెప్పి ఐసీయూలోకి వెళుతుంది మీనా. నాకు తండ్రి లేని లోటును మిమ్మల్ని చూసే మర్చిపోయానని సత్యాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. రవి పెళ్లి విషయంలో సత్యానికి అబద్ధం చెప్పినందుకు అతడికి క్షమాపణలు చెబుతుంది. తాను తెచ్చిన తాయత్తును సత్యం చేయికి కడుతుంది. మీకు ఏం కాదని, మా నాన్నలా ఎప్పటికీ తనకు సపోర్ట్‌గా ఉంటారని మీనా అంటుంది.
ప్రభావతి ఆనందం…
భర్త హార్ట్ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని తెలిసి ప్రభావతి కూడా ఆనందపడుతుంది. మెడిసిన్స్ కొనడానికి తన దగ్గర డబ్బు లేకపోవడంతో ప్రిస్కిప్షన్ రోహిణికి ఇస్తాడు మనోజ్. ప్రభావతి రూమ్‌లోకి వస్తుండటంతో మీనాకు ఫోన్ చేసి రూమ్ నుంచి వచ్చేయమని రంగారావు చెబుతాడు. మీకు సేవ చేసుకునే అదృష్టం నాకు లేదని చెప్పి ప్రభావతికి కనిపించకుండా మీనా వెళ్లిపోతుంది.
నిన్ను అవమానించినోళ్లే నిన్ను నెత్తిన పెట్టుకొనే రోజులు వస్తాయని హాస్పిటల్ నుంచి వెళ్లిపోతున్న మీనాను ఓదార్చుతాడు రంగారావు.
శృతి కంగారు…
తండ్రిని చూసేందుకు కుటుంబసభ్యులు ఓప్పుకోకపోవడమే కాకుండా తనను నానా మాటలు అని హాస్పిటల్ నుంచి వెళ్లగొట్టడంతో రవి కన్నీళ్లు పెట్టుకుంటాడు. రవి ఏడవటం చూసి శృతి కంగారు పడుతుంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొస్తాడు సత్యం. హాస్పిటల్ బిల్లు కోసం డబ్బు సర్ధుబాటు చేశారని కుటుంబసభ్యులను అడుగుతాడు. బాలు కారు అమ్మేశాడని మనోజ్ బదులిస్తాడు.డబ్బు అవసరమైతే ఇంటి పత్రాలు తాకట్టు పెడితే సరిపోయేదిగా అని సత్యం అంటాడు.
మీనాపైనిందలు…
పోయేది పోక ఇంటి పత్రాలు ఎత్తుకొని వెళ్లిపోయిందని మీనాపై నిందలు వేస్తుంది ప్రభావతి. ఇంటి డాక్యుమెంట్స్ మీనాకు అప్పగించిన రోజే…వాటికి తిరిగి తనకు తెచ్చి ఇచ్చిందని సత్యం అసలు నిజం బయటపెడతాడు. తిరిగి మీనాను మన ఇంటికి తీసుకురమ్మని బాలుకు ఆర్డర్ వేస్తాడు.
తెగిన గాలి పటంలా నీ బతుకు మారిపోవడం తాను చూడలేనని అంటాడు. భర్త మాటలకు ప్రభావతి కంగారు పడుతుంది. మీనాను బాలు ఎక్కడ తీసుకొస్తాడోనని కంగారు పడుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.