AP Tourism : పర్యాటక రంగంలో మరో అద్భుతం.. విజయవాడ – శ్రీశైలం మధ్య సీ ప్లేన్‌.. 8 కీలక అంశాలు

Best Web Hosting Provider In India 2024

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగంలో మరో అద్బుతాన్ని ఆవిష్కరించబోతోంది. ఇందుకు విజయవాడ వేదిక కానుంది. ఇటీవల జాతీయ స్థాయి డ్రోన్‌ సమిట్‌ నిర్వహించిన ఏపీ సర్కారు.. ఇప్పుడు సీ ప్లేన్‌ ప్రయోగానికి సిద్ధమైంది. రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. సీ ప్లేన్ ప్రయోగానికి సంబంధించిన 8 కీలక అంశాలు ఇలా ఉన్నాయి.

1.ఈ నెల 9వ తేదీన పున్నమి ఘాట్‌లో విజయవాడ – శ్రీశైలం మధ్య సీ ప్లేన్‌ ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు.

2.డీ హవిల్లాండ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్ల్లేన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు.

3.విజయవాడ- శ్రీశైలం- విజయవాడ మధ్య సీ ప్లేన్‌ నడిపేందుకు ఉన్న అవకాశాలపై నిర్వహించే ఈ ప్రయోగం విజయవంతమైతే.. రెగ్యులర్‌ సర్వీసు ప్రారంభించాలని భావిస్తున్నారు.

4.కృష్ణా నదిలో పున్నమి ఘాట్‌ వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్‌ జెట్టీకి పర్యాటక శాఖ అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇక్కడి నుంచే సీ ప్లేన్‌ బయలుదేరి శ్రీశైలం వెళ్లనుంది.

5.శ్రీశైలం లోని పాతాళ గంగ బోటింగ్‌ పాయింట్‌ వద్ద ఉన్న పాత జెట్టీపై దిగేందుకు అధికారులు త్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు.

6.పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్తంగా సీ ప్లేన్‌ ప్రయోగం చేస్తున్నాయి.

7.బెజవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు.

8.ఈ ప్రయోగం విజయవంతం అయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు.

ఈ ప్రయోగం విజయవంతం అవుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. విజయవంతం అయ్యాక.. రెగ్యులర్ సర్వీసులు ప్రారంభిస్తే.. ఏపీ పర్యాటక రంగానికి మంచి బూస్ట్ అవుతుందని అంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. ఈ ప్రయోగానికి ఎన్నో ఛాలెంజ్‌లు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

Whats_app_banner

టాపిక్

Ap TourismVijayawadaSrisailamKrishna RiverTrending Ap
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024