Telugu Serial: ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు లాంఛ్‌ డేట్‌ ఫిక్స్ – బుల్లితెర మెగాస్టార్ సీరియ‌ల్‌ను ఏ ఛానెల్‌లో చూడాలంటే?

Best Web Hosting Provider In India 2024


Telugu Serial: బుల్లితెర మెగాస్టార్ ప్ర‌భాక‌ర్ కొంత విరామం త‌ర్వాత సీరియ‌ల్ ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు పేరుతో ఓ సీరియ‌ల్ చేస్తోన్నాడు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ సీరియల్ స్టార్ మాలో టెలికాస్ట్ కాబోతోంది. ఈ సీరియ‌ల్ లాంఛింగ్ డేట్‌ను స్టార్ మా రివీల్ చేసింది.

న‌వంబ‌ర్ 12 నుంచి ప్ర‌సారం కానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సీరియ‌ల్ టెలికాస్ట్ టైమ్‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు. ప్రైమ్ టైమ్‌లో ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ ప్ర‌సారమ‌వుతుంద‌ని స‌మాచారం.

సీనియ‌ర్ హీరోయిన్ ఆమ‌ని…

ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్‌లో ప్ర‌భాక‌ర్‌తో పాటు సీనియ‌ర్ హీరోయిన్ ఆమ‌ని ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది. ఈ సీరియ‌ల్‌లో రామ‌రాజు గా ప్ర‌భాక‌ర్‌, వేద‌వ‌తి పాత్ర‌లో ఆమ‌ని క‌నిపించ‌బోతున్నారు. ముగ్గురు కొడుకుల‌కు తండ్రిగా ప్ర‌భాక‌ర్ ఈ సీరియ‌ల్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సీరియ‌ల్‌లో నితిన్‌, ప్ర‌శాంత్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

సీరియ‌ల్ క‌థ ఇదే…

ఇంట్లో రామ‌రాజు మాటే శాస‌నం. అత‌డి మాట‌కు భార్య‌తో పాటు కొడుకులు ఎదురుచెప్ప‌రు. ప్రేమ వ్య‌వ‌హ‌రాల‌కు త‌న కొడుకులు ఆమ‌డ దూరం ఉంటార‌ని రామ‌రాజు గొప్ప‌లు చెబుతుంటాడు. తాను చెప్పిన అమ్మాయిల మెడ‌లోనేమూడుముళ్లు వేస్తార‌ని రామ‌రాజు అనుకుంటాడు.

కానీ రామ‌రాజు కొడుకులు మాత్రం తండ్రి ముందు సిన్సియ‌ర్‌గా న‌టిస్తుంటారు. ప్రేమ‌లో మునిగితేలుతుంటారు. తండ్రికి ప్రేమ‌పెళ్లిళ్లు ఇష్టం లేక‌పోవ‌డంతో…త‌మ ల‌వ్‌స్టోరీస్‌ను అరెంజ్‌డ్ మ్యారేజీలుగా మార్చే ప్ర‌య‌త్నాల్లో ఉంటారు. ముగ్గురు త‌న‌యుల నాట‌కాల‌ను రామ‌రాజు ఎలా తెలుసుకున్నాడు? భార్య పుట్టింటితో రామ‌రాజుకు ఉన్న గొడ‌వ‌లు ఏమిట‌నే అంశాల‌తో ఈ సీరియ‌ల్ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం.

త‌మిళ రీమేక్‌…

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన పాండియ‌న్ స్టోర్స్ 2 సీరియ‌ల్‌కు రీమేక్‌గా ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు తెర‌కెక్కుతోంది. పాండియ‌న్ స్టోర్స్ 2 సీరియ‌ల్ స్టార్ విజ‌య్‌లో టెలికాస్ట్ అవుతోంది. త‌మిళ సీరియ‌ల్స్‌లో టీఆర్‌పీ ప‌రంగా టాప్‌లో ఉంది.

సీరియ‌ల్స్‌…సినిమాల్లో…

సీరియ‌ల్స్ ద్వారా తెలుగులో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు ప్ర‌భాక‌ర్‌. దీపారాధ‌న‌, అన్నాచెల్లెళ్లు, రుతురాగాలు, మ‌ట్టిగాజులు, జాబిల‌మ్మ, అంత‌రంగాలు ప‌లు సీరియ‌ల్స్‌లో లీడ్ రోల్స్ చేశాడు. బ్రాండ్‌బాబు, రాజుగారికోడి ప‌లావ్‌, నెక్స్ట్ నువ్వేతో పాటు ప‌లు సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపించాడు.

రామ్‌న‌గ‌ర్ బ‌న్నీ…

ప్ర‌భాక‌ర్ త‌న‌యుడు చంద్ర‌హాస్ రామ్ న‌గ‌ర్ బ‌న్నీ మూవీతో ఇటీవ‌లే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీని ప్ర‌భాక‌ర్ స్వ‌యంగా నిర్మించాడు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024