Unstoppable with NBK: బాలయ్యతో దుల్కర్ సల్మాన్.. రికార్డు వ్యూస్ సొంతం చేసుకున్న అన్‌స్టాపబుల్ ఎపిసోడ్

Best Web Hosting Provider In India 2024


Unstoppable with NBK: దుల్కర్ సల్మాన్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ ఎంతో తాజాగా మరోసారి తేలిపోయింది. అతడు నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్ లాగే.. బాలకృష్ణతో దుల్కర్ చేసిన స్పెషల్ అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఎపిసోడ్ కూడా సూపర్ హిట్ అయింది. ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఎపిసోడ్ కు రికార్డు వ్యూస్ రావడం విశేషం.

దుల్కర్ సల్మాన్ క్రేజ్ ఇదీ

ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ షోలలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఒకటి. ఈ మధ్యే చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ తో నాలుగో సీజన్ ప్రారంభం కాగా.. రెండో ఎపిసోడ్ లో లక్కీ భాస్కర్ టీమ్ దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత నాగ వంశీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

గత నాలుగు రోజులుగా ఆహా వీడియోలో టాప్ ట్రెండింగ్ లో ఉంటోంది. 5 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలకు దగ్గరగా రావడం విశేషం. ఈ ఎపిసోడ్లో దుల్కర్ తో బాలయ్య జరిపిన సరదా సంభాషణ అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఇందులోనే దుల్కర్ తండ్రి, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి బాలయ్య నేరుగా వీడియో కాల్ చేసి మాట్లాడటం కూడా ప్రేక్షకులను ఆకర్షించింది.

ఓ తెలుగు హీరో కాకపోయినా దుల్కర్ ఎపిసోడ్ కు 5 కోట్ల వరకూ వ్యూస్ రావడం, అందులోనూ నాలుగు రోజుల్లోనే కావడం ఓ రికార్డే. లక్కీ భాస్కర్ మూవీ ప్రమోషన్లలో భాగంగా దీపావళి నాడు ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేశారు.

దూసుకెళ్తున్న లక్కీ భాస్కర్

అటు లక్కీ భాస్కర్ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ వారం రూ.50 కోట్ల మార్క్ అందుకోనుంది. ఇప్పటికే తెలుగులో మహానటి, సీతారామం, కల్కి 2898 ఏడీ లాంటి హిట్ మూవీస్ లో నటించిన దుల్కర్ సల్మాన్.. ఈ లక్కీ భాస్కర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

ఈ లేటెస్ట్ హిట్ తో దుల్కర్ తన రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో అతడు నటించిన ప్రతి సినిమా హిట్ అవడంతో దుల్కర్ కు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం అతడు మరో మూడు తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నాడు.

వీటికి అతడు రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా మలయాళంలో అతడు ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకూ వసూలు చేస్తాడు. లక్కీ భాస్కర్ మూవీ తెలుగుతోపాటు మలయాళంలోనూ మంచి వసూళ్లు రాబడుతుండటంతో దుల్కర్ సల్మాన్ క్రేజ్ మరో లెవల్ కు వెళ్లింది.

ఇక బాలకృష్ణతో దుల్కర్ సల్మాన్ చేసిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఎపిసోడ్ ప్రస్తుతం ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024