Chicken Recipe: మిరియాల పొడితో చికెన్ వేపుడు దీన్ని చూస్తేనే తినేయాలనిపిస్తుంది, రెసిపీ ఇలా చేయండి

Best Web Hosting Provider In India 2024

తాజా మసాలా పొడితో చికెన్ వేపుడు చేస్తే రుచి అదిరిపోతుంది. ఇక్కడ మేము మిరియాల పొడితో చికెన్ వేపుడు ఎలా చేయాలో చెప్పాము. ఇది చాలా కమ్మగా ఉంటుంది. సైడ్ డిష్‌లా కూడా ఉపయోగపడుతుంది. సాంబార్ అన్నంతో ఈ చికెన్ ఫ్రై తిని చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది. పైగా మిరియాల పొడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చికెన్ కూడా లీన్ ప్రోటీన్ ను కలిగి ఉంటుంది. కాబట్టి మిరియాల పొడి చికెన్ కలిపి చేసే ఈ రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని చేయడం చాలా సులువు. రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఫాలో అవ్వండి.

మిరియాల పొడితో చికెన్ వేపుడు రెసిపీకి కావలసిన పదార్థాలు

చికెన్ వేపుడు – అరకిలో

కరివేపాకులు – గుప్పెడు

ఉల్లిపాయ – ఒకటి

అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను

వెల్లుల్లి రెబ్బలు – ఎనిమిది

ఆవాలు – అర స్పూను

నిమ్మరసం – ఒక స్పూను

పసుపు – చిటికెడు

కారం – ఒక స్పూను

కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

నెయ్యి – ఒక స్పూన్

ఉప్పు – రుచికి సరిపడా

దాల్చిన చెక్క – చిన్న ముక్క

జీలకర్ర – ఒక స్పూను

సోంపు – ఒక స్పూను

మిరియాలు – రెండు స్పూన్లు

మరాఠీ మొగ్గ – ఒకటి

ధనియాలు – ఒక స్పూన్

లవంగాలు – మూడు

యాలకులు – మూడు

అనాస పువ్వు – ఒకటి

మిరియాల పొడి చికెన్ వేపుడు రెసిపీ

1. చికెన్ వేపుడును తయారు చేయడానికి ముందు మిరియాల మసాలా పొడి తయారు చేసుకోవాలి.

2. ఇందుకోసం స్టవ్ మీద కళాయి పెట్టి ధనియాలు, జీలకర్ర, మరాఠీ మొగ్గ, అనాసపువ్వు, యాలకులు, లవంగాలు, మిరియాలు, సోంపు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.

3. వాటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అంతే మిరియాల మసాలా పొడి రెడీ అయినట్టే.

4. ఇప్పుడు అదే కళాయిలో ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి కరివేపాకులో వేసి వేయించుకోవాలి.

5. అవన్నీ వేగాక ఉల్లిపాయల తరుగును వేసి వేయించాలి.

6. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి బాగా కలుపుకోవాలి.

7. ఇప్పుడు చికెన్ వేసి ఉప్పు చల్లి మూత పెట్టాలి.

8. చికెన్ లోని నీరు దిగి చికెన్ బాగా ఉడుకుతుంది.

9. ఆ సమయంలో కారం, పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి.

10. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి బాగా కలిపి పావుగంటపై పాటు చిన్న మంట మీద ఉడికించాలి.

11. నీరంతా ఇంకిపోయి చికెన్ వేపుడులా అవుతుంది.

12. అప్పుడు నిమ్మరసం చల్లి స్టవ్ కట్టేయాలి.

13. అంతే టేస్టీ చికెన్ వేపుడు రెడీ అయినట్టే.

14. మిరియాల పొడితో చేసిన ఈ చికెన్ రెసిపీ టేస్టీగా ఉంటుంది.

15. పైన కొత్తిమీరను చల్లుకొని తింటే రుచి అదిరిపోతుంది.

16. స్టవ్ కట్టే ముందు ఒక స్పూను నెయ్యిని కూడా పైన వేసుకుని బాగా కలుపుకోండి. ఇది రుచిని రెట్టింపు చేస్తుంది.

చికెన్ పెప్పర్ ఫ్రై చేసే విధానంలో ఇక్కడ మేము చెప్పిన విధానం ఒకటి. దీని కోసం ముందుగానే మిరియాల మసాలా పొడిని రెడీ చేసుకోవాల్సి వస్తుంది. సాధారణ పెప్పర్ చికెన్ ఫ్రై లో నేరుగా మిరియాల పొడిని కలుపుతారు. రెండింటిలో రుచి కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక్కడ చెప్పిన చికెన్ వేపుడు ఎక్కువ రుచి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇందులో మనం వాడినవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవి. చికెన్ లో ఉండే లీన్ ప్రోటీన్ మనకు అత్యవసరమైనది. అలాగే మిరియాలలో ఉండే పోషకాలు కూడా మనకు కావాల్సినవి. కాబట్టి ఈ మిరియాల మసాలా పొడి తో చికెన్ వేపుడును చేసుకొని చూడండి. మీకు అంతా మీ అందరికీ నచ్చడం ఖాయం.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024