OTT Romantic Movie: ఓటీటీలోకి వస్తున్న బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ మూవీ.. రూ.200 కోట్ల బడ్జెట్.. రూ.3000 కోట్ల వసూళ్లు

Best Web Hosting Provider In India 2024

OTT Romantic Movie: ఓటీటీలో హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్లకు ఓ గుడ్ న్యూస్. బ్లాక్ బస్టర్ రొమాంటిక్ మూవీ మూడు నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఇన్నాళ్లూ ప్రైమ్ వీడియో, జీ5 ఓటీటీల్లో రెంట్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ సినిమాను.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్లందరూ ఫ్రీగా చూసే వీలు కలగనుంది.

ఇట్ ఎండ్స్ విత్ అజ్ ఓటీటీ రిలీజ్ డేట్

ఈ ఏడాది హాలీవుడ్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటి ఇట్ ఎండ్స్ విత్ అజ్ (It Ends With Us). జస్టిన్ బల్డోనీ యాక్ట్ చేసిన ఈ రొమాంటిక్ మూవీ వచ్చే శనివారం (నవంబర్ 9) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

బ్లేక్ లైవ్లీ, హసన్ మిన్హాజ్, జెన్నీ స్లేట్, బ్రాండన్ స్క్లెండర్ నటించిన ఈ సినిమాను 2016లో వచ్చిన నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. మొదట్లోనే కాస్త నెగటివ్ రివ్యూలు వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం సూపర్ సక్సెస్ సాధించింది.

రూ.200 కోట్ల బడ్జెట్.. రూ.3 వేల కోట్ల వసూళ్లు

ఇట్ ఎండ్స్ విత్ అజ్ మూవీని 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ.210 కోట్లు) బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం 349.2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3 వేల కోట్లు) వసూలు చేసింది. తన భయానకమైన గతాన్ని మరచిపోయి సొంతంగా ఓ వ్యాపారం ప్రారంభించాలని కలలు కనే లిలీ బ్లూమ్ (బ్లేక్ లైవ్లీ) చుట్టూ తిరిగే కథే ఈ ఇట్ ఎండ్స్ విత్ అజ్.

తన జీవితాన్ని తిరిగి గాడిలో పెడదామనుకునే సమయంలో రైల్ కిన్‌కెయిడ్ (జస్టిన్ బల్డోనీ)తో ఆమె పీకల్లోతు ప్రేమలో పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు తన పేరెంట్స్ మధ్య రిలేన్షిప్ తాలూకు జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటాయి. ఓ అనుకోని మలుపు ఈ కథను మార్చేస్తుంది.

అదేంటి? లిలీ తన కలను నెరవేర్చుకుందా లేదా అన్నది ఈ ఇట్ ఎండ్స్ విత్ అజ్ మూవీలో చూడొచ్చు. ఈ ఏడాది ఆగస్టులో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. కొన్ని రోజుల కిందటే జీ5, ప్రైమ్ వీడియో ఓటీటీల్లో రెంట్ విధానంలో వచ్చింది. ఇప్పుడు నవంబర్ 9 నుంచి ఇట్ ఎండ్స్ విత్ అజ్ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024