Gunde Ninda Gudi Gantalu: రోహిణికి క్ష‌మాప‌ణ చెప్పిన బాలు – మీనా మంచిత‌నం బ‌య‌ట‌పెట్టిన స‌త్యం – ర‌వి క‌న్నీళ్లు

Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu: తండ్రిని చూడ‌కుండా త‌న‌ను కుటుంబ‌స‌భ్యులు అడ్డుకోవ‌డ‌మే కాకుండా బ‌ల‌వంతంగా హాస్పిట‌ల్ నుంచి పంపించేయ‌డం ర‌వి త‌ట్టుకోలేక‌పోతాడు. ఇంటికొచ్చి క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. భ‌ర్త‌ ఏడ‌వ‌టం చూసి శృతి కంగారు ప‌డుతుంది. కుటుంబానికి ద్రోహం చేశాన‌ని నాతో ఎవ‌రూ మాట్లాడ‌లేద‌ని, నాన్న‌ను చూడ‌కుండా న‌న్ను పంపించేశార‌ని శృతితో చెబుతాడు బాలు. తాను డ‌బ్బులు ఇస్తాన‌ని చెప్పిన తీసుకోలేద‌ని ర‌వి బాధ‌ప‌డ‌తాడు.

ర‌వి ఆవేద‌న‌…

అమ్మ కూడా త‌న‌ను అర్థం చేసుకోవ‌డం లేద‌ని, న‌న్ను ఎందుకు దూరం పెడుతున్నారో తెలియ‌డం, నేను ఏం పాపం చేశాన‌ని ర‌వి ఆవేద‌న‌కు లోన‌వుతాడు. శృతి అత‌డిని ఓదార్చుతుంది. నువ్వేం నేరం చేయ‌లేద‌ని, ప్రేమించి పెళ్లిచేసుకున్న నిన్ను మీవాళ్లు అర్థం చేసుకోలేక‌పోయార‌ని శృతి అంటుంది. నీకు నేను, నాకు నువ్వు ఉన్నామ‌ని, కొన్నాళ్ల‌లోనే ఇవ‌న్నీ స‌ర్ధుకుంటాయ‌ని భ‌ర్త‌ను ఓదార్చుతుంది శృతి.

ప్ర‌భావ‌తి ఆనందం….

స‌త్యం స్పృహ‌లోకి వ‌స్తాడు. అది చూసి ఆనందం త‌ట్టుకోలేక ప్ర‌భావ‌తి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. నేను బాగానే ఉన్నాన‌ని స‌త్యం అంటాడు. మీకు ఇలా కావ‌డంతో ప్ర‌పంచం ఆగిపోయిన‌ట్లుగా అనిపించింద‌ని ప్ర‌భావ‌తి ఎమోష‌న‌ల్ అవుతుంది. నువ్వు అరుస్తుంటే స‌ర్ధిచెప్ప‌డానికి నేను లేన‌ని అనుకున్నావా అని స‌త్యం ఆమె బాధ‌నుదూరం చేసే ప్ర‌య‌త్నం చేస్తాడు.

మీకు ఏమ‌న్నా అయితే మొద‌ట గుండె ఆగిపోయేది నాకే అని ప్ర‌భావ‌తి క‌న్నీళ్ల‌తో భ‌ర్త‌తో అంటుంది. నేను గుండెనొప్పితో ప‌డిపోయిన త‌ర్వాత నువ్వు ఎంత విల‌విల‌లాడావో నేను ఊహించ‌గ‌ల‌ను అని స‌త్యం అంటాడు.

క‌లిసిపోయిన బాలు, ప్ర‌భావ‌తి…

తండ్రి కోలుకోవ‌డం చూసి బాలు కూడా ఆనందం ప‌ట్ట‌లేక‌పోతాడు. అమ్మ కూడా మీరు కోలుకోవాల‌ని క‌ళ్ల‌ల్లో వ‌త్తులు వేసుకొని ఎదురుచూసింద‌ని తండ్రితో చెబుతాడు. ఇన్నాళ్లు నాకు నువ్వే దేవుడికి అనుకున్నాను..కానీ మొద‌టిసారి మీ కోసం గుళ్లో దేవుడికి దండం పెట్టుకున్నాన‌ని తండ్రితో అంటాడు బాలు.

తండ్రికి క్ష‌మాప‌ణ‌లు…

తాను చేసిన గొడ‌వ వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని బాలు బాధ‌ప‌డ‌తాడు. తండ్రికి క్ష‌మాప‌ణ‌లు చెబుతాడు. నిన్ను డిశ్చార్జ్ చేస్తామ‌ని డాక్ట‌ర్లు అన్నార‌ని, ఇంటికి వెళ్లిపోదాం అని తండ్రితో అంటాడు బాలు. ర‌వి రాలేదా బాలును అడుగుతాడు స‌త్యం. వ‌చ్చి ఉండ‌కుండా వెళ్లిపోయాడా…మీనా ఏద‌ని అంటాడు. మ‌నం వ‌ద్దు అనుకున్న వాళ్ల గురించి త‌ల‌చుకొని బాధ‌ప‌డ‌టం ఎందుకొని ప్ర‌భావ‌తి బ‌దులిస్తుంది. స‌త్యం ఏదో చెప్ప‌బోతే ప్ర‌భావ‌తి అడ్డుకుంటుంది.

క‌లిసిపోయిన త‌ల్లీకొడుకులు…

బ‌య‌ట‌కు వెళ్లిన‌ బాలు టిఫిన్ తీసుకొని వ‌స్తాడు. ఇది మీ నాన్న కోస‌మా అని బాలును అడుగుతుంది ప్ర‌భావ‌తి. కాదు నీ కోసం అని బాలు అన‌గానే ప్ర‌భావ‌తి ఎమోష‌న‌ల్ అవుతుంది. నిన్న‌టి నుంచి నువ్వు ఏం తిన‌లేదు క‌దా బాలు అంటాడు. ఒక కీడు ఒక మేలు కోస‌మే అన్న‌ట్లుగా…నాకు ఇలా జ‌ర‌గ‌డం వ‌ల్ల మిమ్మ‌ల్ని ఇలా చూసే అవ‌కాశం నాకు దొరికింద‌ని స‌త్యం అంటాడు.

కారు రిపేర్ కాలేదా…

స‌త్యాన్ని డిశ్చార్జ్ చేస్తారు. కారు ఎక్క‌బోతూ నీ కారు ఇంకా రిపేర్ కాలేదా…ఇంకా ఎన్నాళ్లు అద్దె కారు న‌డుపుకుంటూ తిరుగుతావ‌ని బాలును అడుగుతాడు స‌త్యం. ఇంటికెళ్లిన త‌ర్వాత అవ‌న్నీ మాట్లాడుకుందామ‌ని తండ్రికి స‌ర్ధిచెప్పుతాడు బాలు. స‌త్యం హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ కావ‌డం మీనా చూస్తుంది. మావ‌య్య క్షేమంగా ఉన్నాడు అది చాల‌ని అనుకుంటుంది.

తండ్రికి మాటిచ్చిన బాలు…

డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చిన స‌త్యానికి రోహిణి హార‌తి ఇస్తుంది. నాకో మాట కావాల‌ని బాలును అడుగుతాడు స‌త్యం. మ‌నోజ్ నీకు ఏమ‌వుతాడ‌ని నిల‌దీస్తాడు. ల‌క్ష‌లు మింగినోడు అని బాలు స‌మాధాన‌మిస్తాడు. స‌రిగ్గా చెప్ప‌మ‌ని తండ్రి అన‌డంతో అన్న అని అంటాడు. అన్న భార్య నీకు త‌ల్లి త‌ర్వాత త‌ల్లి అవుతుంద‌ని, రోహిణి మీద చేయిచేసుకోవ‌డం త‌ప్ప‌ని బాలును మందిలిస్తాడు స‌త్యం.

వ‌దిన అనే ప‌దం మీద ఉన్న గౌర‌వాన్ని మ‌ర్చిపోయి నువ్వు చేసింది మ‌హాపాపం అని బాలుకు క్లాస్ ఇస్తాడు. త‌ల్లికే గౌర‌వం ఇవ్వ‌డు వ‌దిన‌కు ఏం ఇస్తాడ‌ని ప్ర‌భావ‌తి మ‌ధ్య‌లో క‌ల్పించుకుంటుంది. నీ జోక్యం వ‌ల్లే ఈ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌భావ‌తిపై ఫైర్ అవుతాడు స‌త్యం.

రోహిణికి క్ష‌మాప‌ణ‌లు…

రోహిణికి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌మ‌ని బాలును ఆదేశిస్తాడు స‌త్యం. నా కోసం ఎప్పుడు మ‌నోజ్ మీద‌నే కానీ నీ మీద కాద‌ని, మొన్న కూడా మ‌నోజ్‌ను కొట్ట‌బోతుంటే ఆ దెబ్బ నీ మిద ప‌డింద‌ని, అది త‌ప్పేన‌ని రోహిణితో అంటాడు బాలు. నేను నిన్ను క్ష‌మించాలంటే నువ్వు ఎప్పుడు మ‌నోజ్‌పై చెయ్యేత్త‌కూడ‌ద‌ని రోహిణి అంటుంది.

అది నా చేతుల్లో లేద‌ని, మ‌నోజ్ చేత‌ల్లో ఉంటుంద‌ని బాలు అంటాడు. ఇంకోసారి నా జోలికి వ‌స్తే ఊరుకోన‌ని బాలుపై మ‌నోజ్ ఫైర్ అవుతాడు. మీ కోపాల వ‌ల్ల ఆవేశాల వ‌ల్ల ఎంత అనార్థం జ‌రిగిందో చూశారా అని రోహిణి అంటుంది.

నోరుజారిన మ‌నోజ్‌…

ఏం జ‌రిగిన నువ్వు ఆవేశ‌ప‌డొద్ద‌ని, అస‌లే రెండు స్టంట్స్ ప‌డ్డాయ‌ని, ఇప్ప‌టికే హాస్పిట‌ల్ బిల్లు ల‌క్ష‌ల్లో అయ్యింద‌ని మ‌నోజ్ నోరు జారుతాడు. అత‌డిపై బాలు, ప్ర‌భావ‌తి ఫైర్ అవుతారు. ఒక్క రూపాయి కూడా క‌ట్ట‌కుండా ఎందుకు బిల్లు గురించి ఎత్తుతావ‌ని మౌనిక …మ‌నోజ్‌ ప‌రువు తీసేస్తుంది.

హాస్పిట‌ల్ బిల్లు కోసం డ‌బ్బు ఎక్క‌డి నుంచి తెచ్చార‌ని అంద‌రిని అడుగుతాడు స‌త్యం. డ‌బ్బులు స‌ర్ధుబాటు కాక బాలు త‌న కారు అమ్మేశాడ‌ని, పై ఖ‌ర్చుల కోసం త‌న న‌గ‌లు కూడా తాక‌ట్టు పెట్టాల్సివ‌చ్చింద‌ని ప్ర‌భావ‌తి అంటుంది. నీ జీవానాధారం అయినా కారు ఎందుకు అమ్మేశావ‌ని బాలుతో అంటాడు స‌త్యం. నీ కంటే నాకు కారు ఎక్కువ కాద‌ని తండ్రితో చెబుతాడు బాలు.

నిజం బ‌య‌ట‌పెట్టిన స‌త్యం…

అంత డ‌బ్బు అవ‌స‌ర‌మైతే ఇంటి ప‌త్రాలు తాక‌ట్టు పెడితే స‌రిపోయేదిగా స‌త్యం అంటాడు. న‌న్ను న‌మ్మ‌కుండా ఇంటి ప‌త్రాల‌ను మీనాకు ఇచ్చారుగా…పోయేది పోకుండా ఇంటి ప‌త్రాలు ప‌ట్టుకొని పోయింద‌ని ప్ర‌భావ‌తి నింద‌లు వేస్తుంది. త‌న రూమ్‌లో ఎంత వెతికినా డాక్యుమెంట్స్‌ క‌నిపించ‌లేద‌ని బాలు అంటాడు.

మ‌న ఇంట్లో లేని టైమ్ చూసి డాక్యుమెంట్స్ ప‌ట్టుకొని పోయి ఎక్క‌డో తాక‌ట్టు పెట్టి ఉంటుంద‌ని ప్ర‌భావ‌తి అంటుంది. నువ్వు జీవితంలో మార‌వా అని ప్ర‌భావ‌తిని కోప్ప‌డుతాడు స‌త్యం. మీనాను ఎప్పుడూ అపార్థం చేసుకుంటూనే ఉంటావా అని అంటాడు.

ఇంటి డాక్యుమెంట్స్ అదే రోజు మీనా తీసుకొచ్చి నా చేతికి ఇచ్చింద‌ని అస‌లు నిజం బ‌య‌ట‌పెడ‌తాడు స‌త్యం. ఆ మాట విని ప్ర‌భావ‌తి, బాలు షాక‌వుతారు.

ఇంటి పెద్ద‌గా…

ఇంటి పాత్ర‌లు నా ద‌గ్గ‌ర ఉంటే ఏదో పెద్ద బ‌రువు, బాధ్య‌త మోస్తున్న‌ట్లుగా ఉంద‌ని, ఇంటి పెద్ద‌గా ఇవి మీ ద‌గ్గ‌రే ఉండ‌టం న్యాయం అంటూ మీనా చెప్పి త‌న‌కు ఇచ్చేసింద‌నే సంగ‌తి స‌త్యంఅంద‌రికి చెబుతాడుతండ్రి చెప్పిన మాట‌లు విని బాలు షాక‌వుతాడు.

మీనా కోసం వ‌చ్చిన బాలు…

మీనాను వెతుక్కుంటూ ఆమె పుట్టింటికి వ‌స్తాడు బాలు. మా అమ్మాయి చేసింది త‌ప్పేన‌ని అందుకు తాను క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని మీనా త‌ల్లి అంటుంది. నేను ఏం త‌ప్పు చేయ‌లేద‌ని మీనా వాదిస్తుంది. త‌ప్పు చేసిన వాళ్ల‌కు త‌ప్పు చేసిన‌ట్లు అనిపించ‌డం లేద‌ని బాలు అంటాడు.

మీ అమ్మాయిని మా ఇంటికి పంపించండి అంటూ మీనా త‌ల్లిని అడుగుతాడు బాలు. బుద్ది ఉన్న ఏ మ‌గాడు నిన్ను తీసుకెళ్ల‌డ‌ని, కానీ నేను నిన్ను తీసుకెళుతున్నాన‌ని మీనాతో బాలు అంటాడు. అక్క‌డితో నేటి గుండెనిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024