Tirupati Crime: తిరుప‌తి జిల్లాలో ఘోరం..ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినిపై లైంగిక దాడి, మత్తు మందిచ్చి అత్యాచారం

Best Web Hosting Provider In India 2024

Tirupati Crime: తిరుప‌తి జిల్లాలో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. స్కూల్ నుంచి సాయంత్రం తిరిగి ఇంటికి వ‌స్తున్న‌ ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినిపై దుండ‌గులు లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. ఇద్ద‌రు వ్యక్తులు దాడి చేసి బ‌ల‌వంతంగా మ‌త్తు మందు క‌లిపిన నీళ్లు తాగించారు. అనంత‌రం ముళ్లు పొద‌ల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. కుమార్తె ఇంటికి రాలేద‌ని వెతుకుతున్న తండ్రికి గాయాల పాలై ముళ్ల పొద‌ల్లో అప‌స్మార‌క స్థితిలో మూలుగుతున్న కుమార్తె క‌నిపించింది.

ఈ అమాన‌వీయ ఘ‌ట‌న తిరుప‌తి జిల్లా య‌ర్ర‌వారిపాలెం మండలంలోని ఒక గ్రామంలో సోమ‌వారం చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలిక స్థానిక జెడ్జీ హైస్కూల్‌లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. బాలిక తండ్రి స‌మాచారం ప్ర‌కారం ఎప్ప‌టిలా సోమ‌వారం కుమార్తె పాఠ‌శాల‌కు వెళ్లింది. సాయంత్రం అవుతున్నా ఇంటికి రాక‌పోవ‌డంతో బాలిక తండ్రి కంగారుప‌డి పాఠ‌శాల‌కు వెళ్లాడు.

పాఠ‌శాల‌లో కుమార్తె లేక‌పోవడంతో వెత‌క‌టం ప్రారంభించాడు. గ్రామానికి స‌మీపంలోని ముళ్ల‌పొద‌ల్లోంచి మూలుగుతున్న సౌండ్ వినిపించింది. దీంతో ముళ్ల‌పొద‌ల్లోప‌లకి వెళ్లి చూశాడు. కుమార్తె తీవ్ర గాయాల‌తో అప‌స్మార‌క స్థితిలో ఉండ‌టాన్ని చూసి చ‌లించిపోయాడు.

పాఠ‌శాల ముగిసిన త‌రువాత బాలిక న‌డుచుకుంటూ ఇంటికి బ‌య‌లుదేరింది. వెనుక‌వైపు నుంచి ప‌ల్స‌ర్ బైక్‌పై మాస్క్‌లు ధ‌రించి ఇద్ద‌రు దుండ‌గులు వ‌చ్చార‌ని, త‌న‌ను అడ్డ‌గించార‌ని బాలిక తెలిపింది. వెంట తెచ్చుకున్న మ‌త్తు మాత్ర‌ల‌ను నీళ్ల‌లో క‌లిపి తాగ‌మ‌ని బాలిక‌ను బల‌వంతం చేశారు. అందుకు బాలిక నిరాక‌రించ‌డంతో ఇద్ద‌రు దుండ‌గులు కాలితో బాలిక పొట్ట‌పైన త‌న్నారు. ఆపై చాకుతో దాడి చేసి బ‌ల‌వంతంగా మ‌త్తు మందు క‌లిపిన నీటిని తాగించారు. దీంతో ఆమె అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లారు.

ఇద్ద‌రు దుండ‌గుల్లో ఒక‌రు ఎవరికో వీడియో కాల్ చేసిన, ఈ అమ్మాయేనా? కాదా? అడిగి తెలుసుకున్న‌ట్లు ఆమె చెప్పింది. త‌రువాత స‌మీపంలో ఉన్న ముళ్ల‌పొద‌ల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్ప‌డిన‌ట్లు చెప్పారు. మ‌త్తు మందు తాగించాక గంట‌కుపైగా బాలిక స్పృహ‌లో లేదు. స్థానికుల స‌హాయంతో బాలిక‌ను ఆమె తండ్రి య‌ల్ల‌మంద ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)కి తీసుకెళ్లారు. ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం బాలిక‌ను పోలీసులు జీపులో పీలేరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

అయితే ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన తిరుప‌తి జిల్లా ఎస్పీ కార్యాల‌యం సోమ‌వారం రాత్రి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పోలీసుల విచార‌ణలో అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయ‌ని తెలిపింది. అయితే విచార‌ణ పూర్తికాక‌ముందే కొంత మంది సోష‌ల్ మీడియాలో అస‌త్య ప్ర‌చారాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, వారిపై చ‌ట్ట ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపింది. విచార‌ణ అనంత‌రం పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని, కేసు న‌మోదు చేసి నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొంది. బాలిక‌పై అత్యాచారం జ‌రిగిన‌ట్లు ప్రచారం జ‌రుగుతుంద‌ని, దీనిపై య‌ర్రావారిపాలెం పోలీసులు అన్ని కోణాల్లో విచార‌ణ చేస్తున్నార‌ని తెలిపింది.

మ‌రోవైపు త‌న కుమార్తెపై అఘాయిత్యం చేసిన దుండ‌గుల్ని ఉరి తీయాల‌ని బాలిక తండ్రి డిమాండ్ చేశారు. అలా చేస్తేనే త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని అన్నారు. త‌న కుమార్తెపై చాకుతో దాడి చేసి, మత్తు మందు క‌లిపిన నీళ్లు తాగించి దారుణానికి ఒడిగ‌ట్టిన ఇద్ద‌రు నిందితుల‌ను గుర్తించి వెంటనే అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు.

మైన‌ర్ బాలికపై జ‌రిగిన దారుణానికి సంబంధించిన స‌మాచారం అందుకున్న చంద్ర‌గిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి ఆసుప‌త్రిలో బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక‌కు మెరుగైన చికిత్స అందించాల‌ని కోరారు. దారుణ ఘ‌ట‌న‌కు కారుకుల‌ను వెంట‌నే అరెస్టు చేయాల‌ని, వారికి క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు.

(జ‌గదీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner

టాపిక్

TirupatiCrime ApCrime NewsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024