Best Web Hosting Provider In India 2024
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన గాలోడు మూవీ ఫ్రీ స్ట్రీమింగ్ రూపంలో ఆడియెన్స్ ముందుకొచ్చింది. యూట్యూబ్‌లో ఈ మూవీ రిలీజైంది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు లేకుండా ఈ సినిమా 4కే వెర్షన్‌ను యూట్యూబ్‌లో చూడొచ్చు.
గెహానా సిప్పీ హీరోయిన్
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో సుడిగాలి సుధీర్‌కు జోడీగా గెహానా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల దర్శకత్వం వహించాడు. 2022 నవంబర్
థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఐదు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ఈ మూవీలో సుడిగాలి సుధీర్ తన కామెడీ టైమింగ్‌తో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించాడు. ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
గాలోడు కథ ఇదే…
రాజు అలియాస్ రజనీకాంత్ (సుడిగాలి సుధీర్) ఏ పని పాట లేకుండా ఊళ్లో జులాయిగా తిరుతుంటాడు. పేకాటలో జరిగిన గొడవలో సర్పంచ్ కొడుకును రాజు కొడతాడు. అతడు చనిపోవడంతో ఆ మర్డర్ కేసు రాజుపై పడుతుంది. పోలీసులకు దొరక్కుండా సిటీకి పారిపోతాడు. సిటీలో శుక్లా (గెహానా సిప్పీ) అనే అమ్మాయితో రాజుకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది.
అంతా సాఫీగా సాగుతోన్న టైమ్‌లో సర్పంచ్ కొడుకు మర్డర్ కేసులో పోలీసులు రాజును అరెస్ట్ చేస్తారు. ఆ నేరం నుంచి రాజు ఎలా నిర్ధోషిగా బయటపడ్డాడు? రాజుపై ద్వేషంతో ఈ హత్యను ఎవరు చేశారు? రాజు ఈ మర్డర్ కేసు నుంచి బయటపడటంతో లాయర్ విజయ్ భాస్కర్ (సప్తగిరి) ఎలాంటి సాయం చేశాడు అన్నదే గాలోడు మూవీ కథ.
సాఫ్ట్‌వేర్ సుధీర్…
గాలోడు సినిమా కంటే ముందు సుడిగాలి సుధీర్, డైరెక్టర్ రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల కాంబినేషన్‌లో సాఫ్ట్‌వేర్ సుధీర్ అనే సినిమా రూపొందింది. సినిమాల కోసం కొన్నాళ్ల పాటు టీవీ షోస్‌కు దూరమయ్యాడు.
హీరోగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. గాలోడుతో పాటు కాలింగ్ సహస్ర, వాంటెడ్ పండుగాడు, త్రీ మంకీస్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. అవేవీ అతడికి విజయాల్ని తెచ్చిపెట్టలేకపోయాడు. ప్రస్తుతం హీరోగా గోట్ మూవీ చేస్తోన్నాడు. హీరోగా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో మళ్లీ టీవీ షోలపై ఫోకస్ పెడుతోన్నాడు.
జబర్ధస్థ్‌కు గుడ్‌బై
జబర్ధస్త్‌తో సుధీర్ టాలెంట్ వెలుగులోకి వచ్చింది. స్కిట్స్‌లో తమ కామెడీ టైమింగ్, పంచ్‌లతో జబర్ధస్థ్ ఫ్యాన్స్‌ను నవ్వించాడు. టీమ్ లీడర్‌గా చాలా కాలం పాటు కొనసాగిన సుధీర్ 2022లో జబర్ధస్థ్‌కు గుడ్‌బై చెప్పాడు. ఢీ, పోవేపోరా, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫ్యామిలీ స్టార్స్, ఆడాళ్లా మజాకా, ఆహా ఓటీటీలో టెలికాస్ట్ అవుతోన్న సర్కార్, కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ షోలకు హోస్ట్‌గా వ్యవహరించాడు సుడిగాలి సుధీర్.