Prabhas: ప్రభాస్‌తో మళ్లీ జతకట్టబోతున్న నయనతార.. స్పిరిట్ కోసం సందీప్‌రెడ్డి వంగా మాస్టర్ ప్లాన్

Best Web Hosting Provider In India 2024


పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ లేడీ సూపర్ స్టార్ నయనతార జతకట్టబోతోంది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ తీస్తుండగా.. ఇందులో హీరోయిన్‌గా నయనతారని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్‌తో కలిసి 2007లో యోగి సినిమాలో నయనతార యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఈ 17 ఏళ్లల్లో ఇద్దరూ మళ్లీ కలిసి నటించింది లేదు. ఇటీవల నయనతార కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. రజినీకాంత్, షారూక్ ఖాన్‌తో జతకట్టిన ఈ భామ వరుస సినిమాలతో బిజీగా ఉంది.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నయన్?

యానిమల్ సినిమా తర్వాత సందీప్‌రెడ్డి వంగా పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇప్పటి వరకు సందీప్ రెడ్డి తీసిన సినిమాల్లో హీరోయిన్స్‌ను కేవలం సాంగ్స్, కొన్ని సీన్లకే పరిమితం చేయకుండా ఫుల్ లెంగ్త్ రోల్ ఇస్తూ వచ్చాడు. దాంతో స్పిరిట్ కథ విన్న నయనతార కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ నయనతార మూవీలో ఉంటే తమిళ్, హిందీలోనూ స్పిరిట్‌‌కి బజ్‌ మరింత పెరగనుందని సందీప్ రెడ్డి వంగా ఆశిస్తున్నాడు.

ప్రభాస్ బిజీ.. బిజీ

కల్కి 2898 ఏడి సినిమా తర్వాత ప్రభాస్ వేగం మరింత పెంచాడు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో చేస్తున్న ది రాజా సాబ్ దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంటుండగా.. ఆ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. అలానే హనుమ రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ఫౌజీ కూడా ఇటీవల షూటింగ్ మొదలైంది. తమిళనాడు పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రెండూ కొలిక్కి వచ్చిన తర్వాత స్పిరిట్‌ సెట్స్‌పైకి వెళ్లనుంది.

స్పిరిట్‌లో కొత్తగా ప్రభాస్

రాజా సాబ్‌, ఫౌజీతో పోలిస్తే స్పిరిట్ కోసం ప్రభాస్ మరింతగా కండలు పెంచాలని సందీప్ రెడ్డి వంగా కోరినట్లు తెలుస్తోంది. పోలీస్‌గా పవర్‌పుల్ క్యారెక్టరైజేషన్‌‌లో చూపించబోతున్నట్లు ఇప్పటికే సంకేతాలిచ్చాడు. అలానే ప్రభాస్ లుక్ కూడా కొత్తగా ఉండబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ స్పిరిట్ తర్వాత కూడా ప్రభాస్ బిజీగానే ఉండనున్నాడు.

మూడేళ్ల తర్వాతే

కల్కి 2898 ఏడి, సలార్ సీక్వెల్ మూవీలు వెయిట్ చేస్తున్నాయి. అయితే.. స్పిరిట్ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లినా.. థియేటర్లలోకి వచ్చేది 2027లోనే అని తెలుస్తోంది. అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ, యానిమల్‌తో రణబీర్ కపూర్‌ని కొత్తగా చూపించి సందీప్‌ రెడ్డి వంగా స్పిరిట్‌లో ప్రభాస్‌ని ఎలా చూపిస్తాడో.. !

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024