Jio Star OTT: ఓటీటీలో నయా సంచలనం.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌‌‌ ఆధిపత్యానికి గండికొట్టేలా ‘జియో స్టార్’ తెరపైకి!

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో బిగ్ డీల్ తెరపైకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం ఓటీటీల్లో ఆధిపత్యం చెలాయిస్తుండగా.. డిస్నీ+హాట్‌స్టార్‌, జియో సినిమా కాస్త వెనకబడిపోయినట్లు కనిపిస్తోంది. దాంతో ఈ రెండూ కలిసి ఒకే స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘జియో స్టార్’ పేరుతో వచ్చేందుకు డీల్ కుదిరింది. ఈ మేరకు కొత్త డొమైన్ కూడా నవంబరు 14 నుంచి ప్రేక్షకులకి అందుబాటులోకి రానుంది.

వాస్తవానికి డిస్నీ+హాట్‌స్టార్‌, జియో సినిమా విలీనం గురించి ఈ ఏడాది ఆరంభం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. సుదీర్ఘ చరిత్ర, అనుభవం ఉన్న హాట్‌స్టార్‌కి మంచి టెక్నాలజి అందుబాటులో ఉంది.

ఆ రెండు ఓటీటీల ఆధిపత్యానికి గండి

జియో సినిమాకి భిన్నమైన భాషల్లో నెట్‌వర్కింగ్‌తో పాటు సాధన సంపత్తి ఉంది. దాంతో ఈ రెండు నెట్‌వర్క్‌ల కలయిక నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌కి గట్టి ఎదురుదెబ్బకానుంది.

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఈ రెండు ఓటీటీ సంస్థలే ఇప్పటి వరకు ఓటీటీ సినిమాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ ఎక్కువగా పోటీపడుతున్నాయి. ఇప్పుడు జియో స్టార్ రాకతో ఈ పోటీ మరింత పెరగనుంది. డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో పాగా వేయాలని ఆశిస్తున్న ముఖేష్ అంబాని ఈ డీల్ వెనుక పెద్ద ప్లాన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి.

డీల్‌లో క్రికెట్ మ్యాచ్‌ల్లేవ్

హాట్‌స్టార్, జియో సినిమా ఇప్పటికే క్రికెట్‌కి సంబంధించి గట్టి పోటీదారులు ఉన్నాయి. అయితే.. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో మాత్రమే ఈ డీల్ ఉంటుందని.. క్రికెట్‌, స్పోర్ట్స్ సంబంధించి లైవ్ స్ట్రీమింగ్‌‌ మాత్రం ‘జియో స్టార్’లో ఉండదని తెలుస్తోంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024