మరింత మందిని ఉద్యోగులుగా తయారుచేసేలా తమ మాతృమూర్తి “కస్తాల మరియమ్మ” గారి పేరు మీద నందిగామలో నిరుద్యోగులకు – విద్యార్థులకు ఉచితంగా మోడల్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని తెలిపిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..


ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :

మరింత మందిని ఉద్యోగులుగా తయారుచేసేలా తమ మాతృమూర్తి “కస్తాల మరియమ్మ” గారి పేరు మీద నందిగామలో నిరుద్యోగులకు – విద్యార్థులకు ఉచితంగా మోడల్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని తెలిపిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

గ్రామ -వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొఫెషన్ డిక్లేర్ చేసి- రివైజ్డ్ పే స్కేల్ విధానం అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సచివాలయ ఉద్యోగులు ఏర్పాటుచేసిన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ,ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒకేసారి లక్ష ఉద్యోగాలు కల్పించి – ఉద్యోగాల విప్లవం సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ ది ..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపిన గ్రామ -వార్డు సచివాలయ ఉద్యోగులు ..

గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నిరుద్యోగులను గాలికొదిలేసి -ఒక్క ఉద్యోగ అవకాశం కూడా కల్పించకుండా పరిపాలన చేస్తే .. నేడు లక్షలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులు గా మార్చిన ఘనత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ది ..

ప్రజలకు మరింత మంచి చేకూరేలా సచివాలయ ఉద్యోగులు – వాలంటీర్లు వినయంతో ,బాధ్యతగా పని చేయాలని సూచించిన ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు ..

మీకు లాగా మరింత మంది విద్యార్థులు -నిరుద్యోగులు ఉద్యోగాలు పొందేలా రాష్ట్రంలోనే ఉత్తమమైన స్టడీ సెంటర్ ల నుండి ప్రొఫెసర్లను రప్పించి నందిగామలో తమ మాతృమూర్తి పేరుమీద సొంత ఖర్చులతో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం : ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

నిరుద్యోగులుగా ఎన్నో బాధలు -అవమానాలు భరించిన తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా – మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి తమ కుటుంబాలన్ని జీవితాంతం రుణపడి ఉంటాయని తెలిపిన సచివాలయ ఉద్యోగులు ..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర పంచాయతీ కమిషనర్ ,ఏఈ , సచివాలయాల ఉద్యోగులు , కౌన్సిల్ సభ్యులు , సీఐ, ఎంఆర్ఓ , తదితరులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *