



ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :
గత ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని – వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రజలు బేరీజు వేసుకోవాలి ..
చందర్లపాడు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
బుధవారం ఉదయం 150 గడపలు తిరిగి ప్రజలతో మాట్లాడి ప్రభుత్వ పనితీరును వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు ..
తమ ఇళ్లకు వస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారికి అపూర్వ స్వాగతాలు పలుకుతూ – ఆయనతో మమేకమవుతున్న ప్రజలు ..
ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు ..
ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన 90% హామీలను అమలు చేసి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు ..
గతంలో మాదిరిగా జన్మభూమి కమిటీల దగ్గరకు వెళ్లి నుంచునే పరిస్థితి లేకుండా – నేరుగా మీ ఇంటికే వాలంటీర్లు వచ్చి సంక్షేమ పథకాలు అందిస్తున్న పరిస్థితులు వచ్చాయని వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ,జడ్పిటిసి ,సచివాలయ సిబ్బంది -వాలంటీర్లు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..