మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై దాడికి కుట్ర 

Best Web Hosting Provider In India 2024

అనంతపురం: శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం కోమటికుంట్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైయ‌స్ఆర్‌సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడికి టీడీపీ నేతలు స్కెచ్‌ వేశారు. కోమటికుంట్లలో ఉన్న పెద్దారెడ్డిపై దాడి చేయాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ క్రమంలో వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పెద్దారెడ్డిపై దాడి చేయాలని టీడీపీ నేతలతో జేసీ ప్లాన్ చేయించారు. కోమటికుంట్ల గ్రామానికి వెళ్లేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తల యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. జేసీ వర్గీయుల అరాచకాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొనేందుకు  కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమయ్యారు.

Best Web Hosting Provider In India 2024