Best Web Hosting Provider In India 2024

గుడివాడ: కుప్పంలో చంద్రబాబు గెలిచేది లేదని, 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు అవుతాయని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు కొడాలి నాని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పరిశీలన పేరుతో చంద్రబాబు విచిత్ర విన్యాసాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం ఏపీలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్, టీడీపీ పార్టీలేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా కాంగ్రెస్ నేతల బూట్లు నాకిన వెధవ చంద్రబాబు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టీడీపీలో చేరిన దౌర్భాగ్యుడని తూర్పారపట్టారు. 1978 నుంచి 40 ఏళ్ల ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు కీలకంగా ఉన్నాడని.. అయినా ఇన్నేళ్లలో ప్రాజెక్టులు ఎందుకు కట్టలేకపోయాడని ప్రశ్నించారు.