మనిషిని మనిషిగా చూడటమే రాజ్యాంగం

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్‌బాబు

 వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో అంబేద్క‌ర్‌కు ఘ‌న నివాళులు

తాడేపల్లి:  మనిషిని మనిషిగా చూడటమే రాజ్యాంగమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్‌బాబు అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 69వ వర్థంతి సందర్భంగా తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌బాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యనేతలు పాల్గొని, అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.
    మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు, లిడ్‌క్యాప్‌ మాజీ చైర్మన్‌ కాకుమాను రాజశేఖర్, వేమూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌ వరికూటి అశోక్‌బాబు, మాదిగ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కనకరావు మాదిగ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అన్యాయంపై గొంతు విప్పితే కేసులు: ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి.
– జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించిన ఘనత వైయ‌స్‌ జగన్‌కి దక్కుతుంది. కానీ సీఎం చంద్రబాబు దళితుల మధ్య చిచ్చుపెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. దళితులు, దళిత మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం కానీ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కానీ అస్సలు పట్టించుకోవడం లేదు. అన్యాయాలపై గొంతు విప్పిన వారిపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారు. 

భారత రాజ్యాంగాన్ని కాలరాశారు: జూపూడి ప్రభాకర్‌రావు, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
 – మనిషై పుట్టిన ప్రతి ఒక్కరికీ హక్కులు ఉంటాయని చాటి చెప్పిన దేవుడు అంబేడ్కర్‌. మనిషిని మనిషిగా చూడటం ఎంత అవసరమో ఆయన పోరాటం సమాజానికి తెలియజేసింది. ఆ మహానేత అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగ స్ఫూర్తిని, సామాజిక బాధ్యతను వైయ‌స్‌ జగన్‌ సారథ్యంలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వం గడిచిన ఐదేళ్ల పాలనలో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లింది. అదే ఈ కూటమి ప్రభుత్వం అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని దారుణంగా కాలరాసింది.

Best Web Hosting Provider In India 2024