ఈ నెల 13కు రైతాంగ సమస్యలపై ధర్నా వాయిదా 

Best Web Hosting Provider In India 2024

 తాడేపల్లి:  ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ  ఆధ్వ‌ర్యంలో ఈ నెల 11న త‌ల‌పెట్టిన రైతుల ధ‌ర్నాను 13వ తేదీకి వాయిదా వేశారు.  ఐదు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ ఉన్నందున రైతుల ధ‌ర్నాను వాయిదా వేస్తున్నట్లు వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయం ప్రకటించింది. 13న రైతాంగ సమస్యలపై జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించింది. మిగతా కార్యక్రమాలు యథాతథంగా జరగనున్నాయి.

కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ రంగం కుదేలైంది. గత వైయ‌స్ఆర్‌సీపీ  హయాంలో ఆర్బీకేలు స్థాపించి, ఈ–క్రాప్‌ పెట్టి పారదర్శకంగా ప్రతి రైతుకు ఆర్బీకే ద్వారా ఉచిత పంటల బీమా అందించింది. దళారుల వ్యవస్థ లేకుండా ధాన్యం నేరుగా రైతు వద్దకే వచ్చి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టింది. చంద్రబాబు సర్కార్‌ వచ్చిన తర్వాత ఏ రైతుకూ ధాన్యానికి కనీస మద్దతు ధర రావడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ  నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 వైయ‌స్ఆర్‌సీపీ పోరుబాట 

రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీపరంగా పోరుబాటకు వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు.  కీలక అంశాలైన రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై పోరుబాట కార్యాచరణను ఇటీవ‌ల‌ ప్రకటించారు. 

 
డిసెంబర్ 13వ తేదీన..  

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం సమర్పణ

బాబు సర్కార్‌కు డిమాండ్లు

రూ.20 వేల పెట్టుబడి సహాయం, 

ధాన్యానికి మద్దతు ధర, 

ఉచిత పంటల భీమా పునరుద్ధరణ

డిసెంబర్‌ 27వ తేదీన..

పెంచిన కరెంటు ఛార్జీలపై ఆందోళన. ఎస్‌ఈ కార్యాలయాలు, సీఎండీ కార్యాలయాలకు ప్రజలతో కలిసి వెళ్లి విజ్ఞాపన పత్రాలు అందించే కార్యక్రమం

బాబు సర్కార్‌కు డిమాండ్లు

కరెంటు ఛార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలి

జనవరి 3వ తేదీన..  

ఫీజు రీయంబర్స్‌మెంట్‌ అంశంపై పోరుబాట. పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలంటూ.. విద్యార్థులతో కలిసి జనవరి 3న కలెక్టర్‌ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించే కార్యక్రమం.

బాబు సర్కార్‌కు డిమాండ్లు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి 

వసతిదీవెన బకాయిలు తక్షణమే ఇవ్వాలి 

 

Best Web Hosting Provider In India 2024