Best Web Hosting Provider In India 2024

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థతో దేశానికే ఆదర్శంగా నిలిచామని మంత్రి బూడి ముత్యాల నాయుడు పేర్కొన్నారు. అసెంబ్లీలో మంగళవారం మంత్రి మాట్లాడారు. ఇచ్చిన హామీలన్నీ సీఎం వైయస్ జగన్ అమలు చేశారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రతీ పథకంలోనూ పారదర్శకతకే ప్రాధాన్యం ఇచ్చారు.అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తున్నామని, పేదలకు డీబీటీ ద్వారా ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థతో గ్రామాల రూపురేఖలు మారాయని చెప్పారు. ఈ వ్యవస్థతో ప్రభుత్వ సేవలు అన్నీ ప్రజల వద్దకే అందిస్తున్నామని చెప్పారు. సచివాలయాల్లో ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. సచివాలయాల ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తాం