Best Web Hosting Provider In India 2024

అసెంబ్లీ: సాగు, తాగునీటి ప్రాజెక్టులపై వైయస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ప్రాజెక్టుల కోసం తక్కువ ఖర్చు చేస్తున్నామనే మాట అవాస్తవం అని కొట్టిపారేశారు. అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణ వేగం ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్ట్ 1వ టర్నల్ పూర్తయిందని, రెండో టర్నల్ రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. టర్నల్ బోరింగ్ మెథడ్‌లో కాకుండా మాన్యువల్‌లో జరగడంతో పనుల్లో కొంత జాప్యం జరగిందన్నారు. నల్లమల సాగర్‌లో 5 టీఎంసీల నీరును నిల్వ చేసేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ అని, దాన్ని గత ప్రభుత్వంలో ప్రాజెక్టు నిర్మాణం ప్రోటోకాల్ ప్రకారం జరగలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం అనేక తప్పిదాలు చేసిందని వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పట్ల వైయస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది.