Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: అసెంబ్లీ సమావేశాలు రేపటితో అయిపోయిన తర్వాత ఇక మనం గేర్ మార్చాల్సిన సమయం కూడా వచ్చిందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇన్నిరోజులు మనం చేసిన ప్రచారం, గడప గడపకూ కార్యక్రమాలు ఒక ఎత్తు. అసెంబ్లీ ముగిశాక చేసే కార్యక్రమాలు, ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరు ఇవన్నీ ఇంకొక ఎత్తు అన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమమంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత, సీఎం వైయస్.జగన్. మోహన్ రెడ్డి సమావేశమయ్యారు.