Best Web Hosting Provider In India 2024

విశాఖ: చంద్రబాబుపై ఈడీ, ఐటీ, సీఐడి మోగిస్తున్న అవినీతి మోతకు సమాధానం చెప్పు అంటూ వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి నారా బ్రహ్మణిని నిలదీశారు.
తప్పుచేసి సంఘీభావం కోరడం సిగ్గుచేటుః
– ప్రజాధనం దోపిడీ చేసి ఆధారాలతో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు అని అందరికీ తెలిసిపోయింది.
– అధికారాన్ని అడ్డంపెట్టుకుని అనేక కుంభకోణాలకు పాల్పడిన చంద్రబాబు, లోకేశ్‌లు తప్పులు మీద తప్పులు చేస్తూ కూడా బుకాయించడం ఎంతవరకు సబబు..? అవాస్తవాల ప్రచారంతో వారు చట్టం నుంచి తప్పించుకోవాలని చూడటం సిగ్గుచేటు.
– అవినీతిపరులకు, దొంగలకు ప్రజలు చప్పట్లు కొట్టి సంఘీభావం తెలియజేయమని నారా బ్రాహ్మణి ట్వీట్ చేయడం హాస్యాస్పదంగా ఉంది.
– స్కిల్‌డెవలప్‌మెంట్, ఫైబర్‌గ్రిడ్, అమరావతి అసైన్డ్‌ల్యాండ్స్, ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబు, లోకేశ్ పాత్ర ఉందని సీఐడీ, న్యాయస్థానాలు ప్రాధమిక ఆదారాలు గుర్తించినప్పుడు నేరస్తులు నిరసనలు, సంఘీభావాలు కోరుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాను.