Best Web Hosting Provider In India 2024

విజయవాడ: ఐదు కోట్ల ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉండటం చారిత్రాత్మక అవసరమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో వైయస్ఆర్‌సీపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ సభకు రాష్ట్ర నలమూలల నుంచి పార్టీ శ్రేణులు భారీగా హాజరుకానున్నారు. మొత్తం 8,222 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల సమావేశం జరగనున్న విజయవాడలోని ఇంధిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి,రాష్ర్టమంత్రి జోగిరమేష్,పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్,శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డిలు ఆదివారం పరిశీలించారు. సభావేదికతోపాటు ఎన్ని ద్వారాల ఏర్పాటుచేశారు. పార్టీ ప్రతినిధులలో ఎవరెవరు ఏ ఏ ప్రవేశమార్గాల నుంచి సమావేశమందిరంలోకి ప్రవేశిస్తారు. సమావేశానికి హాజరయ్యే వారికి భోజన ఏర్పాట్లు,తదితర అంశాల గురించి పరిశీలించారు. హాజరయ్యే ప్రతినిదులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి పలు సూచనలు చేశారు. స్టేడియం చుట్టుపక్కల భధ్రతా ఏర్పాట్లకు సంభంధించి విజయవాడ పోలీస్ కమీషనర్ క్రాంతిరాణాటాటా వివరించారు. పార్టీ అధ్యక్షులు, రాష్ర్ట ముఖ్యమంత్రి వైయస్ జగన్ హాజరవుతున్న దృష్ట్యా అన్ని రకాల భధ్రతా చర్యలు తీసుకున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డికి కమీషనర్ వివరించారు. ప్రజలకు, ట్రాఫిక్ కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసే క్రమంలో భాగంగా ప్రభుత్వం చేస్తున్న అభివృధ్ది-సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్ళే ఆలోచనతో సోమవారంనాడు సమావేశం నిర్వహిస్తున్నామని తెలియచేశారు. ముఖ్యంగా మండలస్దాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పార్టీ ప్రతినిధులందరూ ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో ఇంటరాక్ట్ అవుతారన్నారు. ఇప్పటికే ప్రజలతో మమేకమైన వైయస్సార్ సిపిని క్షేత్రస్ధాయిలో మరింత సమర్ధంగా నడిపించడం,క్షేత్రస్దాయిలో పార్టీకి అనుబంధంగా తయారైన,సచివాలయ కన్వీనర్ల వ్యవస్ధ,గృహసారధుల వ్యవస్ధ,రానున్న ఎన్నికలకు సంబంధించి బూత్ కమిటీ సభ్యులను నియమించడం జరిగింది. వీటన్నింటిని సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గ ఇన్ ఛార్జ్,శాసనసభ్యులు సమన్వయానికి లోబడి మండల స్ధాయి నాయకత్వం ఎన్నికల వరకు చాలా సమర్ధంగా పనిచేయాల్సి ఉంది. ఈ నేపధ్యంలో సోమవారం జరగనున్న సమావేశం ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంది. అదేవిధంగా గత నాలుగున్నరేళ్ళుగా ప్రభుత్వం వైపు నుంచి అమలుచేస్తున్న సంక్షేమ పధకాలు, విప్లవాత్మక సంస్కరణలు వంటి వాటి గురించి ఇప్పటికే ఎంఎల్ఏలు,నియోజకవర్గ ఇన్ చార్జ్ లు గడపగపడపకు ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు.ప్రజలకు వివరిస్తున్నారు. దాదాపు 75 శాతం పూర్తి చేశారు. వారి నియోజకవర్గ పరిధులలో అన్ని ఇళ్ళను టచ్ చేయడం జరిగింది. కోటి 60 లక్షల హౌస్ హోల్డ్ లో ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. వాటిలో ద్వితీయశ్రేణి నేతలు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో జగనన్న సురక్ష ద్వారా అనేక సేవలు ప్రతి ఇంటిలోని పౌరులకు అందాయి. చాలా మంచి స్పందన కనిపించింది. ప్రస్తుతం జగనన్న ఆరోగ్యసురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నారు. విస్ర్తుత స్దాయిలో ఆరోగ్యసేవలు అందిస్తున్నారు. ఇవన్నీ కూడా రాష్ర్టంలో పేదల జీవితాలను మేలిమలుపు తిప్పి వాళ్ళ కుటుంబాలలో వెలుగులు నింపే కార్యక్రమాలు. వీటన్నింటిని ప్రజల ఆదరిస్తున్నారు…ఆస్వాదిస్తున్నారు. సాధరణంగా మధ్యతరగతి కుటుంబాలు వైద్య సేవల విషయంలో ఆందోళనతో ఉంటుంటారు. ఆరోగ్యసేవలు ఖరీదైపోయిన ఈరోజులలో జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండేందుకు అవకాశం ఉంది. శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్,స్పెషలిస్ట్ డాక్టర్ తో అనుసంధానం చేస్తూ అందులో భాగంగానే ఆరోగ్యసురక్ష తీసుకు వచ్చారు. ధనవంతులకు మాత్రమే పరిమితమైన,కార్పోరేట్ ఆస్పత్రుల సేవలు పేదల ఇళ్లకు తీసుకువెళ్తున్నారు. దీనిని మరింతగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ కార్యక్రమం గురించి ముఖ్యమంత్రి శ్రీవైయస్ జగన్ రేపటి సమావేశంలో మరింతగా వివరిస్తారు. వాటితోపాటు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ-అభివృధ్ది పధకాలను మరింతగా ప్రజలలోకి తీసుకువెళ్ళాల్సిన ఆవశ్యకతను ఆయన తెలియచేస్తారని అన్నారు.
ప్రతిపక్షం,ఎల్లోమీడియా ప్రభుత్వంపై చేస్తున్నవిషప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలి. ఇప్పటికే పార్టీపరంగా చేస్తున్న అంశాలను మరింతగా ఎలా పదును ఎక్కించాలి. అవినీతి కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు విప్లవకారుడు,దేశభక్తుడులాగా చూపించుకునే ప్రయత్నాలను ఎలా ఎండగట్టాలి.ఇవన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి సందేశంలో ప్రస్తావనకు వస్తాయన్నారు. ఎన్నికలు రానున్న తరుణంలో ఇది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న సమావేశం అని తెలియచేశారు. అందుకే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలియచేశారు.