Guntakallu Mla: తనపై వార్తలు రాస్తే పట్టాలపై పడుకొోబెతానని వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

Best Web Hosting Provider In India 2024

Guntakallu Mla: తనపై వార్తలు రాస్తే పట్టాలపై పడుకొోబెతానని వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

Bolleddu Sarath Chand HT Telugu Jan 29, 2025 12:42 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bolleddu Sarath Chandra HT Telugu
Jan 29, 2025 12:42 PM IST

Guntakallu Mla: తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే పట్టాలపై పడుకోబెడతానంటూ గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీడియాలో తన గురించి చెడుగా రాయొద్దని, దుష్ప్రచారం చేస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టడానికి వెనుకాడనని వార్నింగ్ ఇచ్చారు.

మీడియా ప్రతినిధుల్ని హెచ్చరిస్తున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
మీడియా ప్రతినిధుల్ని హెచ్చరిస్తున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Guntakallu Mla: మాజీ మంత్రి, గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రెచ్చిపోయారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే వారిని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. గుంతకల్లు ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మీడియాలో తన గురించి వార్తలు రాసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గుమ్మనూరు జయరాం, తనపై వచ్చిన ఆరోపణల గురించి తన ముందే ప్రశ్నించాలన్నారు.

yearly horoscope entry point

తనమీద, తన తమ్ముడిపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు. ఎవరికైనా సందేహాలు ఉంటే తనముందే ప్రశ్నలు వేయాలని వెనుక మాట్లాడొద్దని హెచ్చరించారు. ఏ ఛానల్ వారు అయినా తనను అడగాలని, తనకు ఎవరితో శతృత్వం లేదని, పట్టాలపై పడుకోబెడతారని తన మీద రాశారని, తాను తప్పు చేయనని, తన మీద, తన తమ్ముడి మీద వెనుక నుంచి అనొద్దని, నేరుగా అంటే సరిదిద్దుకుంటానని చెప్పారు.

తనపై వార్తలు రాసే ముందు అన్ని విధాలుగా ఆలోచించి రాయాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఏ ఛానల్ అయినా తనను ప్రశ్నించవచ్చని, ఫ్రెండ్లీగానే తనతో మాట్లాడొచ్చని, తాను వెళ్లిపోయిన తర్వాత దుష్ప్రచారం చేయొద్దన్నారు.

తన గురించి వార్తలు రాసే వారిపై పట్టాలపై పడుకోబెట్టడానికి కూడా తాను సిద్ధం గా ఉన్నానని చెప్పారు. తప్పు చేయకుండా తనమీద, తమ్ముడి మీద వార్తలు రాయొద్దని హెచ్చరించారు.

గుమ్మనూరు జయరాం 2019-22 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కర్నూలు జిల్లాలో భూముల కబ్జాతో పాటు జూదం నిర్వహణలో ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరి గుంతకల్లు నుంచి పోటీ చేసి గెలుపొందారు.

Whats_app_banner

టాపిక్

TdpAndhra Pradesh NewsCoastal Andhra PradeshAp PoliticsRayalaseema
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024