FMG Doctors: ఆన్‌లైన్‌లో చదువుకున్న డాక్టర్లు మూడేళ్లు ఇంటర్న్‌షిప్‌ చేస్తేనే పర్మనెంట్‌ రిజిస్ట్రేషన్‌.. తేల్చేసిన NMC

Best Web Hosting Provider In India 2024

FMG Doctors: ఆన్‌లైన్‌లో చదువుకున్న డాక్టర్లు మూడేళ్లు ఇంటర్న్‌షిప్‌ చేస్తేనే పర్మనెంట్‌ రిజిస్ట్రేషన్‌.. తేల్చేసిన NMC

Bolleddu Sarath Chand HT Telugu Jan 29, 2025 01:48 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bolleddu Sarath Chandra HT Telugu
Jan 29, 2025 01:48 PM IST

FMG Doctors: విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న వారు, వివిధ సందర్భాల్లో ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరైన వారు.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేస్తేనే పర్మనెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తామని ఏపీ మెడికల్ కౌన్సిల్ స్పష్టం చేసింది.

విజయవాడ హెల్త్‌ యూనివర్శిటీ ఎదుట ఫారిన్ డిగ్రీ వైద్యుల ఆందోళన
విజయవాడ హెల్త్‌ యూనివర్శిటీ ఎదుట ఫారిన్ డిగ్రీ వైద్యుల ఆందోళన
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

FMG Doctors: విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన వారు నేషనల్ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలకు అనుగుణంగా దేశంలో ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేస్తేనే వారికి పర్మనెంట్ రిజిస్ట్రేషన్‌ కల్పిస్తామని ఏపీ మెడికల్ కౌన్సిల్ స్పష్టం చేసింది.

yearly horoscope entry point

పీఆర్‌ కోసం గత కొన్ని రోజులుగా విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న వారు విజయవాడలోని ఎన్టీఆర్‌ వైద్య ఆరోగ్య విశ్వ విద్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. తమను వైద్యులుగా గుర్తించాలని, పీజీ ప్రవేశపరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలను అమలు చేయాల్సిందేనని ఏపీ మెడికల్ కౌన్సిల్ ప్రకటించింద.ి

కోవిడ్ బాధితులు, ఉక్రెయిన్ విద్యార్థులు…

కోవిడ్ మహమ్మారితో లాక్‌డౌన్‌ సమయంలో స్వదేశానికి వచ్చిన విద్యార్థులతో పాటు ఉక్రెయిన్ర-ష్యా మధ్య తలెత్తని యుద్ధం కారణంగా వేలాదిమంది వైద్య విద్యార్థులు 2020-24 మధ్య కాలంలో భారత్ తిరిగి వచ్చారు. అలా వచ్చిన విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో పలు కారణాలతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎంబీబీఎస్‌ చదువుతూ స్వదేశానికి వచ్చి.. ఆ తర్వాత తిరిగి విదేశాలకు వెళ్లి కోర్సుల్ని పూర్తి చేశారు. ఈ క్రమంలో 2023 నవంబర్ 22న నేషనల్ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలు జారీ చేసింది.

విదేశాల్లో చదువుతూ ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరైన ఫైనల్ ఇయర్‌ విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు దేశంలో రెండేళ్ల ఇంటర్న్‌‌షిప్‌ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ ఇంటర్న్‌షిప్‌లో ఏడాది పాటు క్లినికల్ క్లరికల్‌షిప్‌, మరో ఏడాది ఇంటర్న్‌షిప్ ఉంటుంది.

అదే సమయంలో కోర్సు మధ్య కాలం నుంచి చివరి ఏడాది వరకు పలు విడతల్లో ఆన్‌లైన్ తరగతులకు హాజరైన విద్యార్థులు మూడేళ్ల ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో రెండేళ్లు క్లినికల్ క్లరిక్ షిప్, మరో ఏడాది ఇంటర్న్ షిప్ ఉంటుంది.

నిబంధనలు పాటించాల్సిందే…

ప్రస్తుతం ఇంటర్న్‌షిప్ చేస్తున్న విద్యార్థుల్లో కొందరు ఈ నిబంధనలు పాటించడానికి నిరాకరించి ఆందోళన చేస్తున్నారని ఏపీ మెడికల్ కౌన్సిల్ పేర్కొంది. దీనిపై విద్యార్థుల ఆన్‌లైన శిక్షణా కాలాన్ని పరిగణలోకి తీసుకోవాలని వారు చదివిన యూనివర్శిటీలు జారీ చేసిన లేఖలను నేషనల్ మెడికల్ కౌన్సిల్ పరిశీలించింది. అయా లేఖల్లో ఆన్‌లైన్ శిక్షణకు సంబంధించిన పూర్తి వివరాలు లేకపోవడంతో నిబంధనలు సడలించడానికి ఎన్‌ఎంసీ నిరాకరించింది. మూడేళ్ల శిక్షణ లేకుండా పీఆర్‌ చేయొద్దని స్పష్టం చేసింది. ఎన్‌ఎంసీ మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని కౌన్సిలింగ్ సమయంలో అండర్ టేకింగ్ ఇచ్చారని ఏపీ మెడికల్ కౌన్సిల్ స్పష్టం చేసింది.

ఆన్‌లైన్ శిక్షణకు సంబంధించి అదనంగా ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయని విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. 2024 నవంబర్ 19న ఎన్‌ఎంసీ జారీ చేసిన ఆదే‎వాల ప్రకారం విదేశాల్లో చదువుకున్న విద్యర్థుల మెడికల్ డిగ్రీలను అయా దేశాల ఎంబసీల ద్వారా ధృవీకరించిన తర్వాత పీఆర్‌చేయాల్సి ఉంటుందని, అర్హులైన వారికి మాత్రమే వాటిని మంజూరు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ వైద్యులుగా ధృవీకరణ జారీ చేయలేదని, ఎన్‌ఎంసీ గైడ్‌లైన్స్‌ మేరకు వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Whats_app_banner

టాపిక్

StudentsEducationVisaTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024