




Best Web Hosting Provider In India 2024

Netflix Greatest Rivalry: నెట్‌ఫ్లిక్స్‌లోకి అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ వార్ ఇలా ఉంటుంది
Netflix Greatest Rivalry Documentary: నెట్‌ఫ్లిక్స్ లోకి మరో అదిరిపోయే డాక్యుమెంటరీ రాబోతోంది. ఈసారి ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ వార్ తెరవెనుక సీన్ ఎలా ఉంటుందో దీని ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారు.
Netflix Greatest Rivalry Documentary: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చిన తర్వాత ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీసే కాదు.. డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి. అలాంటిదే మరో డాక్యుమెంటరీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది. ఏ దాయాదులు క్రికెట్ ఆడితే ప్రపంచమే ఆగిపోతుందో ఆ ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ యుద్ధం, తెరవెనుక సీన్లు, ఆ యుద్ధంలో తలపడే క్రికెటర్ల అభిప్రాయాలతో ఈ డాక్యుమెంటరీ రూపొందింది.

నెట్‌ఫ్లిక్స్ గ్రేటెస్ట్ రైవల్రీ డాక్యుమెంటరీ
నెట్‌ఫ్లిక్స్ లోకి గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ (Greatest Rivalry: India vs Pakistan) పేరుతో ఓ ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ రాబోతోంది. ఫిబ్రవరి 7 నుంచి ఈ కొత్త డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. బుధవారం (జనవరి 29) దీనికి సంబంధించి ఓ ట్రైలర్ ను కూడా నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది.
“అతిపెద్ద రైవల్రీ ఎలా ఉంటుందో దానిని అనుభవించిన లెజెండ్సే పంచుకోబోతున్నారు. నెట్‌ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ కానున్న గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ లో క్రికెట్ లోని అత్యంత భీకరమైన రైవల్రీ, గ్లోరీ, ప్యాషన్ ఎలా ఉంటుందో చూడండి” అనే క్యాప్షన్ తో ఈ ట్రైలర్ ను నెట్‌ఫ్లిక్స్ షేర్ చేసింది.
గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ ట్రైలర్
గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ పేరుతో నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతున్న డాక్యుమెంటరీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో దాయాదుల మధ్య జరిగిన కొన్ని ఇంటెన్స్ మ్యాచ్ విజువల్స్ తోపాటు వాటిలో ఆడిన రెండు దేశాల లెజెండరీ ప్లేయర్స్ తమ అనుభవాలను పంచుకోవడం కూడా చూడొచ్చు.
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే బంతికి, బ్యాట్ కు మధ్య జరిగే సమరమే కాదు.. అంతకంటే ఎక్కువే అవుతుంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పే డైలాగుతో ఈ ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత ఇండియా, పాకిస్థాన్ కు చెందిన లెజెండ్స్ సౌరవ్ గంగూలీ, సెహ్వాగ్, సునీల్ గవాస్కర్, షోయబ్ అక్తర్, వకార్ యూనిస్, రమీజ్ రాజాలాంటి వాళ్లు ఇండోపాక్ క్రికెట్ వార్ లో ఉండే ఉత్కంఠ ఎలా ఉంటుందన్నది పంచుకోవడం చూడొచ్చు.
ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ లాగే ఈ డాక్యుమెంటరీ కూడా అదే స్థాయి ఉత్కంఠతో, ఆసక్తికరంగా సాగబోతోందని ఈ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వెర్సెస్ పాకిస్థాన్ డాక్యుమెంటరీని ఫిబ్రవరి 7 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.
సంబంధిత కథనం