




Best Web Hosting Provider In India 2024

The Mehta Boys OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న నయా మూవీ.. తెలుగులోనూ.. దర్శకుడిగా అత్తారింటికి దారేది యాక్టర్
The Mehta Boys OTT Release: ది మెహతా బాయ్స్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ రివీల్ అయింది. ట్రైలర్‌తో పాటే రిలీజ్ తేదీ వెల్లడైంది. తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‍కు రానుంది.
సీనియర్ యాక్టర్ బొమన్ ఇరానీ బాలీవుడ్‍లో చాలా చిత్రాల్లో నటించారు. అయితే, తెలుగులో అత్తారింటికి దారేది చిత్రంతో బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత మరికొన్ని తెలుగు సినిమాల్లో నటించారు. బాలీవుడ్‍లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. బొమన్ ఇరానీ ఇప్పుడు దర్శకుడిగా మారారు. ‘ది మెహతా బాయ్స్’ చిత్రాన్ని డైరెక్షన్ చేశారు. దర్శకత్వంతో పాటు ఈ మూవీలో లీడ్ రోల్ కూడా చేశారు. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. నేడు (జనవరి 29) ట్రైలర్‌తో పాటు స్ట్రీమింగ్ డేట్ కూడా వెల్లడైంది.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ది మెహతా బాయ్స్ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డబ్బింగ్ వెర్షన్‍ల్లోనూ అందుబాటులోకి వస్తుంది. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవనుంది. ఈ విషయాన్ని నేడు ట్రైలర్‌తో పాటే ప్రైమ్ వీడియో వెల్లడించింది.
ది మెహతా బాయ్స్ సినిమాలో బొమన్ ఇరానీతో పాటు అవినాష్ తివారీ, శ్రేయా చౌదరి, పుజా సరుప్ లీడ్ రోల్స్ చేశారు. దర్శకుడిగా ఇరానీకి తొలి మూవీ. నిర్మాతగానూ వ్యవహించారు. ఈ చిత్రాన్ని బొమన్ ఇరానీ, దానిష్ ఇరానీ, సుజాత్ సౌదాగర్, వికేశ్ భుటానీ ప్రొడ్యూజ్ చేశారు.
తండ్రీకొడుకుల మధ్య..
ది మెహతా బాయ్స్ చిత్రం తండ్రీ కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ రిలేషన్‍షిప్ డ్రామాగా సాగుతుంది. ఈ చిత్రంలో తండ్రిగా బొమన్, కుమారుడిగా అవినాష్ నటించారు. తండ్రీకొడుకుల మధ్య విభేదాలు, బంధం సరిగా లేకపోవడం లాంటివి ట్రైలర్లో ఉన్నాయి. ఎమోషనల్, హృదయాన్ని తాకే సీన్లతో ట్రైలర్ ఉంది. తల్లి హఠాత్తుగా చనిపోవటంతో దూరంగా ఉంటున్న ఇష్టంలేని తన తండ్రి వద్ద కుమారుడు 48 గంటల పాటు ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, వారు ఎలా ఉన్నారు? ఆ తండ్రీకొడుకుల మధ్య బంధం బలపడిందా? అనేవి ఈ మూవీలో ప్రధాన అంశాలుగా ఉంటాయి.
ది మెహతా బాయ్స్ కథ తన వద్ద చాలా ఏళ్ల నుంచి ఉందని, ఇప్పుడు అందరితో పంచుకుంటున్నందుకు చాలా థ్రిల్‍గా ఉందని నటుడు, దర్శకుడు, నిర్మాత బొమన్ ఇరానీ చెప్పారు. తండ్రీకొడుకుల బంధాన్ని ఈ మూవీలో చూపించానని తెలిపారు. చిత్రంతో చాలా మంది కనెక్ట్ అవుతారని ఈ చిత్రంలో కొడుకుగా నటించిన అవినాశ్ తివారీ అన్నారు. మానవ సంబంధాల ఆధారంగా ఉండే స్టోరీ అందరినీ మెప్పిస్తుందని అనుకుంటున్నానని చెప్పారు. ఫిబ్రవరి 7 నుంచి ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియో ఓటీటీలో చూడొచ్చు.