




Best Web Hosting Provider In India 2024

Janhvi Kapoor Condom Ad: కండోమ్ యాడ్‌కు జాన్వీ కపూర్ బాగా సెట్ అవుతుంది.. హీరోల్లో అతడు పర్ఫెక్ట్: మ్యాన్‌ఫోర్స్ ఓనర్
Janhvi Kapoor Condom Ad: కండోమ్ యాడ్‌కు జాన్వీ కపూర్ బాగా సూటవుతుందని అన్నాడు ప్రముఖ కండోమ్ తయారీ సంస్థ మ్యాన్‌ఫోర్స్ ఫౌండర్ రాజీవ్ జునేజా. అతని కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
Janhvi Kapoor Condom Ad: జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లోని టాప్ నటీమణుల్లో ఒకరు. తన పర్ఫెక్ట్ ఫిగర్ తో ఆమె ఆకట్టుకుంటోంది. అయితే ఆమె సినిమాలకే కాదు.. తన కండోమ్ యాడ్ కు కూడా బాగా సూటవుతుందని అంటున్నారు మ్యాన్‌కైండ్ ఫార్మా్ ఫౌండర్ రాజీవ్ జునేజా. రాజ్ షమానీ పాడ్‌కాస్ట్ లో మాట్లాడిన ఆయన.. మేల్ యాక్టర్స్ లో అయితే రణ్‌బీర్ కపూర్ అని చెప్పడం విశేషం.

కండోమ్ యాడ్‌కు కార్తీక్ ఆర్యన్ అందుకే..
ప్రముఖ ఫార్మా కంపెనీ మ్యాన్‌కైండ్ నుంచి వచ్చే కండోమ్స్ మ్యాన్‌ఫోర్స్ కు రెండేళ్ల కిందట బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు వరకూ సన్నీ లియోనీ ఉండగా.. ఆమెను పక్కన పెట్టి ఈ యువ నటుడిని తీసుకున్నారు. దీని వెనుక కారణమేంటో మ్యాన్‌కైండ్ ఫార్మా ఫౌండర్ రాజీవ్ జునేజా తాజాగా వివరించారు.
రాజ్ షమానీ పాడ్‌కాస్ట్ లో మాట్లాడిన ఆయన.. తమ కండోమ్స్ యాడ్ కు ఇంకా ఎవరు సూటవుతారన్నది కూడా చెప్పారు. “కార్తీక్ ఆర్యన్ ను తీసుకోవడానికి ప్రధాన కారణం కండోమ్ విషయంలో పురుషుల సైడ్ కూడా చెప్పాలని అనుకోవడమే” అని రాజీవ్ వెల్లడించారు. లైంగిక చర్యకు అవతలి వ్యక్తి అనుమతి ఎంత ముఖ్యమో చెప్పే ప్రయత్నం కార్తీక్ ఆర్యన్, మ్యాన్‌ఫోర్స్ సంయుక్తంగా చేశాయి.
జాన్వీ, రణ్‌బీర్ బాగా సూటవుతారు
ఇక తమ కండోమ్ యాడ్ కు ఇంకా ఎవరైనా బాగుంటుందని మీరు భావిస్తున్నారు అని ప్రశ్నించినప్పుడు రాజీవ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “కండోమ్ కోసమైనా, మరే ఇతర యాడ్ కోసం అయినా జాన్వీ కపూర్. ఆమె సరిగ్గా సూటవుతుంది. ఆమె బెస్ట్ ఛాయిస్” అని రాజీవ్ స్పష్టం చేశారు. ఇక మేల్ యాక్టర్ గురించి అడిగితే రణ్‌బీర్ పేరు చెప్పారు.
అంతేకాదు కిల్ మూవీ ఫేమ్ లక్ష్య పేరు కూడా ఆయన చెప్పడం విశేషం. ఇక తమ సంస్థ నుంచే వచ్చే ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ కిట్ కోసం అనుష్క శర్మ లేదా దీపికా పదుకోన్ అయితే బాగుంటారని కూడా ఈ సందర్భంగా రాజీవ్ అభిప్రాయపడ్డారు. అయితే దీపికను తాము సంప్రదించలేదని, ఆమె డిమాండ్ చేసే మొత్తం తాము ఇవ్వలేమని కూడా చెప్పారు.