




Best Web Hosting Provider In India 2024

Pushpa 2 on Netflix: కన్ఫమ్.. 23 నిమిషాల అదనపు నిడివితో.. ఐదు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లోకి పుష్ప 2.. కొన్ని గంటల్లోనే..
Pushpa 2 on Netflix: పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేస్తోంది. మొత్తానికి ఈ విషయాన్ని ఆ ఓటీటీ బుధవారం (జనవరి 29) రాత్రి అధికారికంగా తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించడం విశేషం.
Pushpa 2 on Netflix: పుష్ప 2 రూల్ ఇక ఓటీటీలో మొదలుకానుంది. మరికొన్ని గంటల్లోనే అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెట్టబోతోంది. అది కూడా 23 నిమిషాల అదనపు రన్ టైమ్ తో రానుండటం విశేషం. ఈ విషయాన్ని బుధవారం (జనవరి 29) రాత్రి నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఓ 30 సెకన్ల స్పెషల్ వీడియోను పోస్ట్ చేస్తూ ఆ ఓటీటీ ట్వీట్ చేసింది.

పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్
పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ గురువారం (జనవరి 30) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అంటే ఓటీటీలో ఈ మూవీ రన్ టైమ్ ఏకంగా 3 గంటల 44 నిమిషాలు ఉండనుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.
“పుష్ప అన్నా మీ మాట విన్నాడు. పుష్ప రూల్ హిందీలో కూడా. పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ 23 నిమిషాల అదనపు ఫుటేజీతో జనవరి 30 నుంచి హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మీ నెట్‌ఫ్లిక్స్ లో” అనే క్యాప్షన్ తో స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది.
పుష్ప అంటే పువ్వు అనుకుంటివా.. వైల్డ్ ఫైర్ అనే డైలాగుతో ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. నిజానికి పుష్ప 2 హిందీ వెర్షన్ మాత్రం కాస్త ఆలస్యం కావచ్చన్న వార్తలు మొదట్లో వచ్చాయి. కానీ ఇప్పుడు హిందీలోనూ జనవరి 30 నుంచే స్ట్రీమింగ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది.
పుష్ప 2 ఓటీటీలోకి..
అంతకుముందు బుధవారం (జనవరి 29) మధ్యాహ్నం నెట్‌ఫ్లిక్స్ మరో ట్వీట్ చేస్తూ పుష్ప 2 ట్రైలర్ ను పోస్ట్ చేసింది. అందులో హిందీ వెర్షన్ తప్ప మిగిలిన నాలుగు వెర్షన్లు త్వరలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. కొన్ని గంటల తర్వాత హిందీ వెర్షన్ ను కూడా తీసుకొస్తున్నామంటూ మొత్తం ఐదు భాషల్లో రీలోడెడ్ వెర్షన్ రానుందని స్పష్టం చేసింది.
దీంతో దేశవ్యాప్తంగా పుష్ప 2 ఓటీటీ హంగామా మరికొన్ని గంటల్లోనే మొదలు కానుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1830 కోట్లకుపైగా కొల్లగొట్టి సంచలనం సృష్టించిన ఈ మూవీ.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో రికార్డులను తిరగరాయనుంది. ముఖ్యంగా హిందీ వెర్షన్ థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఓటీటీలోనూ ఆ వెర్షన్ కే ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సంబంధిత కథనం