




Best Web Hosting Provider In India 2024

Pushpa 2 OTT: ఇవాళ పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్.. పవన్ కల్యాణ్ 24 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్!
Pushpa 2 OTT Streaming And Allu Arjun Breaks Pawan Kalyan Record: ఓటీటీలోకి ఇవాళ పుష్ప 2 వచ్చేసింది. రీలోడెడ్ వెర్షన్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 24 ఏళ్ల రికార్డ్‌ను అల్లు అర్జున్ బ్రేక్ చేసిన విషయం ఆసక్తికరంగా మారింది.
Pushpa 2 OTT Release And Allu Arjun Breaks Pawan Kalyan Record: అల్లు అర్జున్, రష్మిక మందన్నా మరోసారి జత కట్టిన సినిమా పుష్ప 2 ది రూల్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్లలో ఎలా విడుదలయిందో.. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.

పుష్ప 2 రీలోడ్ వెర్షన్‌తో
గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో వరల్డ్ వైడ్‌గా విడుదలైన పుష్ప 2 ది రూల్ సుమారుగా 65 రోజులకు ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా రీలోడ్ వెర్షన్‌తో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి ఐదు భాషల్లో పుష్ప 2 ది రూల్ ఓటీటీ రిలీజ్ అయింది. మొత్తంగా 3 గంటల 44 నిమిషాల రన్‌టైమ్‌తో పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదిలా ఉంటే, పుష్ప 2 ది రూల్ ఓటీటీ స్ట్రీమింగ్ నేపథ్యంలో అల్లు అర్జున్ బ్రేక్ చేసిన ఓ రికార్డ్ ఆసక్తికరంగా మారింది. అయితే, అది థియేటర్లలో పుష్ప 2 విడుదలైనప్పుడు జరిగింది. హైదరాబాద్ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ 70 ఎమ్ఎమ్ థియేటర్‌ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులుగా ముద్దుగా వైకుంఠం అని పిలుచుకుంటారు.
ఖుషి సినిమాకు 1.56 కోట్లు
ఎందుకుంటే దశబ్దాల నుంచి సంధ్య థియేటర్‌ను పవన్ కల్యాణ్ టెరిటరీ అని అంటారట. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్‌లో ఆయన ఫ్యాన్స్ ఒక రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, 2001 సంవత్సరంలో టికెట్స్ రేట్స్ 10, 20 రూపాయలు ఉన్న సమయంలో ఖుషి సినిమా కోటి 56 లక్షల రూపాయల (రూ. 1.56 కోట్లు) గ్రాస్ కలెక్షన్స్ ఈ ఒక్క సంధ్య థియేటర్ నుంచి వసూలు అయ్యాయి.
ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు సంధ్య థియేటర్‌లలో ప్రదర్శితం అయ్యాయి. కానీ, పవన్ కల్యాణ్ ఖుషి సినిమా సెట్ చేసిన హయ్యెస్ట్ కలెక్షన్స్‌ను ఏ మూవీ బీట్ చేయలేకపోయింది. రెండో స్థానంలో కూడా పవన్ కల్యాణ్ తొలిప్రేమ (1998) సినిమానే ఉంది. అంటే, సంధ్య 70 ఎమ్ఎమ్ థియేటర్‌లో ఖుషి తర్వాత అంతటి కలెక్షన్ కలెక్ట్ చేసింది తొలిప్రేమ మూవీనే.
టాప్ 1లో పుష్ప 2 ది రూల్
కానీ, గతేడాది ఈ రికార్డ్‌ను అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ బ్రేక్ చేసేసింది. రూ. 1.56 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటేసి సంధ్య థియేటర్‌లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ కలిగిన సినిమాగా పుష్ప 2 రికార్డ్ కొట్టి టాప్ 1లో నిలిచింది. అంటే, ఇందులో టికెట్ రేట్ల ధరలు కీలక పాత్ర పోషించాయి. 2001లో ఉన్న టికెట్ రేట్లకు 2024లో పుష్ప 2కి పెంచిన ధరలలో భారీ తేడా ఉంది.
కానీ, ఏది ఏమైనప్పటికీ ఒక్క సంధ్య థియేటర్‌లో ఖుషి రూ. 1.56 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే పుష్ప 2 ది రూల్ రూ. 1.59 కోట్లు (2025 సంవత్సరంతో కలిపి) కొల్లగొట్టింది. ఇలా పవన్ కల్యాణ్ 24 ఏళ్ల పవన్ కల్యాణ్ రికార్డ్‌ను అల్లు అర్జున్ బ్రేక్ చేశాడు. కాగా, పుష్ప 2 ది రూల్ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ. 1830 కోట్లుకుపైగా కలెక్షన్స్ వచ్చాయి.
సంబంధిత కథనం
టాపిక్