Best Web Hosting Provider In India 2024

Brahmamudi January 30th Episode కావ్య ప్లాన్ సక్సెస్, 3 నెలల గడువు- అపర్ణకు నిజం చెప్పిన సుభాష్- ధాన్యలక్ష్మీకి తలవంపులు
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఆస్తి కోసం కోర్టులో కేసు వేయనని కల్యాణ్ ఫైర్ అవుతాడు. ధాన్యలక్ష్మీ, ప్రకాశంపై కోప్పడతాడు. నాకు ఇంటి వారసత్వం కావాలి, ఇంటి తాలుకు మంచితనం కావాలి, ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నం కావొద్దనే తాతయ్య ఆశయం కావాలి. బంధాలే ఆస్తి అంటే, అనుబంధాలే ఐశ్వర్యం అంటే అని కల్యాణ్ అంటాడు. దాంతో శభాష్ కల్యాణ్ బాగా చెప్పావ్ అని స్వప్న అంటుంది.
కడుపు నిండే మాటలు చెప్పావ్
ఏమైయిపోయాయమ్మా అప్పటి మమతలు, పెద్దమ్మను అక్కలా, అమ్మమ్మను తల్లిలా, తాతయ్యను తండ్రిలా చూసే నువ్వు ఎక్కడ తప్పడడుగు వేశావ్. ఆస్తులు ఆత్మీయతను మింగేశాయా అని డైలాగ్‌లతో ఇచ్చిపడేస్తాడు కల్యాణ్. ఈ మాట మీ అమ్మను కాదు మా అత్తను అడుగు కల్యాణ్ అని స్వప్న అంటుంది. ఇందిరాదేవి లేచి చాలురా. నాకు ఈ మాటలు చాలు. ఆస్తి కోసం భార్య వైపు మాట్లాడిన మీ నాన్న, మీ అమ్మ నీ పాఠశాలలో బుద్ధి తెచ్చుకోవాలి. అయినా మారకుంటే వాళ్ల కర్మ. ఇవాళ నువ్ నాకు కడుపు నిండే మాట చెప్పావురా అని ఇందిరాదేవి అంటుంది.
నీలాగే నీ మాటలు కూడా కల్మశంగా ఉన్నాయిరా. నా ఆయిష్శు కూడా పోసుకుని నిండు నూరేళ్లు చల్లగా ఉండరా అని ఇందిరాదేవి అంటుంది. రేయ్.. నీకు అర్థం కావట్లేదురా. మీ తాత ఈ అనామకురాలి చేతిలో పెడితే డబ్బంతా ఏం చేస్తుందో తెలియకుండా చేస్తుంది అని గోల్డ్, గెస్ట్ హౌజ్ తాకట్టు గురించి చెబుతుంది ధాన్యలక్ష్మీ. ఇల్లు గురించి మా వదిన నా కంటే ఎక్కువే ఆలోచిస్తుంది. తను ఏం చేసిన ఇంటికోసమే చేస్తుంది. చెప్పినా చెప్పకపోయినా. వదినా ఏది చేసిన అన్నయ్యకు చెప్పే చేస్తుంది అని కల్యాణ్ అంటాడు.
కల్యాణ్ నువ్ మమ్మల్ని బాగా అర్థం చేసుకున్నావ్. మమ్మల్ని కూడా అర్థం చేసుకునే రోజు వస్తుంది అని రాజ్ అంటాడు. లాయర్ గారు మీ వాది సోది విన్నారుగా అని స్వప్న అంటే.. ఇక్కడితో ముగించి వెళ్తాను అని లాయర్ వెళ్లిపోతాడు. థ్యాంక్స్ కవిగారు సమయానికి వచ్చి ఇంట్లో ఏ అనర్థం జరగకుండా కాపాడారు. చిన్నత్తయ్య, చిన్న మావయ్య మీ అందరి మనసుల్లో చాలా ప్రశ్నలు ఉండొచ్చు. కానీ, మేము ఏ తప్పు చేయట్లేదు. ఆస్తులు తాకట్టుపెట్టట్లేదు. కవిగారికి అన్నాయం చేయాలని మాకే కాదు ఇంట్లో ఎవరికీ లేదు అని కావ్య అంటుంది.
తలవంపులు తీసుకొస్తావని
కానీ, మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఉన్న చెప్పలేని పరిస్థితి. ఏదో ఒకరోజు మీ అందరికి సమాధానం దొరుకుతుంది. మాకు మూడు నెలలు గడువు కావాలి. ఆ తర్వాత మీరు అడగకపోయినా అన్ని విషయాలు అందరికి తెలుస్తాయి. దయచేసి అర్థం చేసుకోండి అని కావ్య అంటుంది. చాలు ఆపు అని గట్టిగా అరిచిన ధాన్యలక్ష్మీ నాకు ఇన్ని తలవంపులు తెస్తావనుకోలేదురా అని వెళ్లిపోతుంది. దాంతో తను అంతే అని అంతా అనుకుంటారు.
కల్యాణ్ రాకరాక వచ్చావ్ దా టిఫిన్ పెడతాను అని తీసుకెళ్తుంది అపర్ణ. తర్వాత పూలకుండీ బద్దలు కొడుతుంది ధాన్యలక్ష్మీ. కొడుకు ఇచ్చిన షాక్‌తో గుండెపగిలిందని సింబాలిక్‌గా చూపిస్తున్నావా. కావ్యను ఏం చేయలేక ఇలా పగలకొడితే ప్రాపర్టీ డ్యామేజీ కింద నీకు వచ్చే ఆస్తిలో కట్ చేసుకుంటారు అని రుద్రాణి అంటుంది. మూడు నెలలు టైమ్ కావాలందిగా అప్పుడు ఎలా తప్పించుకుంటుందో చూద్దాం అని ధాన్యలక్ష్మీ అంటుంది.
ఆ తర్వాత కూడా నువ్ ఏం చేయలేవు అని రుద్రాణి అంటే.. నువ్ అనేదేంటీ.. వాళ్లను చంపేయాలా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అంత పెద్ద క్రైమ్ చేసి నువ్ జైలుకు పోతే ఈ ఆస్తిని ఎవరు అనుభవిస్తారు. మూడు నెలల్లో పక్కా ప్లాన్‌తో వచ్చి మనల్ని ఎర్రోలను చేస్తారు. వాళ్లు అడిగిన టైమ్ ఇవ్వకూడదు. మన ఆస్తి మనకు కావాలని ప్రతిరోజు టార్చర్ పెట్టాలి. మనతో ఎందుకు పెట్టుకున్నానో ఏడవాలి అని రుద్రాణి అంటుంది.
మూడు నెలలు గడువు
నాకు కావాల్సింది టార్చర్ కాదు. నా ఆస్తి నాకు రావడం. అందుకోసం ఏం చేస్తానో చూస్తూ ఉండు అని వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ. ఏంటిది ఇంత కన్ఫ్యూజింగ్‌గా మాట్లాడి వెళ్లిపోయింది అని రుద్రాణి అంటుంది. రాహుల్ వచ్చి అడిగితే.. మన దారిలోకే వచ్చినట్లే వచ్చి రావట్లేదు. పూర్తిగా మన గ్రిప్పులో పెట్టుకోలేకపోతున్నాం. నువ్ రాజ్ కావ్య మూడు నెలలు ఏం ప్లాన్ చేస్తారో. ఓ కన్నేసి ఉంచు. ఒకే ఒక్క అవకాశం కావాలి. ఈ మూడు నెలల గడువు పక్కనపెట్టేసి ఆస్తి ముక్కలు అయ్యేవరకు వదలను అని రుద్రాణి అంటుంది.
తర్వాత ఆఫీస్‌లో రాజ్ పిలిచిన పలకపోయేసరికి గురువు గారు అని పిలుస్తుంది. నాకు ఇదంతా నేర్పింది మీరే కదా అందుకే గురువు గారు అని కావ్య అంటుంది. నీవల్లే నాకు టెన్షన్. ఇంట్లో ఏం చేశావ్ గుర్తు చేసుకో అని రాజ్ అంటే.. కవిగారిని పిలిపించి సమస్యను పరిష్కరించాను అని కావ్య అంటుంది. కల్యాణ్‌ను పిలిపించి ప్రాబ్లమ్ సాల్వ్ చేశావ్. అది నాకు ముందే చెబితే నేను రిలాక్స్‌డ్‌గా ఉండేవాను. చెప్పకుండా చివరి వరకు టెన్షన్ పెట్టి చంపాలనుకున్నావా అని రాజ్ అంటాడు.
ఇప్పుడు చూడండి నో కోర్ట్ నో లాయర్. ఎవరు మనల్ని క్వశ్చన్ చేయరు. మూడు నెలల టైమ్ దొరికింది కాబట్టి బయటి సమస్యలు కూడా పరిష్కరించొచ్చు. నాకు సన్మానం చేయాల్సింది పోయి ఇలా అంటారా అని కావ్య అంటుంది. ఇంతలో రాజ్‌కు కాల్ వస్తుంది. తర్వాత రేపు జితేంద్ర గారు డిజైన్స్ చూడటానికి వస్తున్నారు. నేను అప్రూవ్ చేసిన డిజైన్స్ మ్యాన్యుఫాక్చర్‌కు పంపావ్ కదా అని రాజ్ అంటే.. లేదు. మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి. అందుకే పంపలేదు అని కావ్య అంటుంది.
పొగరును తెలివితేటలుగా
నేను అప్రూవ్ చేసిన తర్వాత కూడా నీకు తప్పులు కనిపించాయా. నేను సీఈఓను నువ్ డిజైనర్‌వి. వెళ్లి డిజైన్స్ తీసుకురా అని రాజ్ అంటాడు. నేను తీసుకురాను అని ఎదురుచెబుతుంది కావ్య. రాజ్ వెళ్లి తీసుకుందామని చూస్తే రావు. దాంతో కావ్య నవ్వుతుంది. దాంతో ప్రింటర్‌ను కొడుతాడు రాజ్. ప్రింటర్‌లో సమస్య వెతికి సాల్వ్ చేస్తుంది కావ్య. దీని పొగరును తెలివితేటలుగా ప్రదర్శిస్తోంది అని రాజ్ అంటాడు. మరోవైపు అపర్ణ, సుభాష్ మాట్లాడుకుంటారు.
సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. మూడు నెలలు అడిగిందిగా అని అపర్ణ అంటుంది. కావ్య మీద కోపం పోలేదా అని సుభాష్ అంటాడు. కాదు. తనను అందరు అంటే చూడలేకపోతున్నాను. అసలు మనం ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామో తెలుసా. కల్యాణ్ సమయానికి రాకుంటే ప్రకాశం వాళ్లు కోర్టుకు వెళ్లేవారు అని అపర్ణ అంటుంది. కానీ, వెళ్లలేదుగా. కావ్య ఎప్పుడు అలా చేయనివ్వదు. కల్యాణ్‌ను చివరి నిమిషంలో రప్పించేలా చేసింది అని సుభాష్ చెబుతాడు.
కల్యాణ్ తనంతట తాను వచ్చాడనుకుంటున్నావా. ఎవరు పిలిచినా రాని కల్యాణ్ వచ్చాడంటే దానికి కారణం కావ్య. తనే ఒప్పించి తీసుకొచ్చి ఉంటుంది. నాకు రాజ్, కావ్య మీద పూర్తి నమ్మకం ఉంది. మూడు నెలల్లో అన్ని సమస్యలు తీరుస్తారు. అప్పటివరకు ఇలా అనుమానించడం ఆపేసి ప్రశాంతంగా ఉండు అని సలహా ఇచ్చి వెళ్లిపోతాడు సుభాష్. మరోవైపు రాజ్‌ను కళ్లు మూసుకోమ్మని కావ్య అంటే రాజ్ సీరియస్ అవుతాడు.
బుర్రపెరగలేదు
నీకన్న చిన్న పిల్లలు బెటర్. నువ్ మనిషివి పెరిగావ్ కానీ బుర్రపెరగలేదని అని రాజ్ అంటాడు. ఈ డిజైన్స్ చూస్తే నేనేంటో తెలుస్తుంది అని కావ్య చూపిస్తుంది. చాలా బాగున్నాయి. ఎలా చేశావ్ ఇంత బాగా డిజైన్స్ అని రాజ్ అంటాడు. ఎందుకు క్లైంట్‌కు మీరే చేసినట్లు చెబుదామనా అని ఇదివరకు చేసినదానిపై కౌంటర్ వేస్తుంది కావ్య. దాంతో డిజైన్స్ స్పెషాలిటీ చెబుతుంది కావ్య. నిజంగా స్పెషల్‌గానే ఉందని రాజ్ అంటాడు.
దాంతో తనను తాను మెచ్చుకుంటుంది కావ్య. డిజైనర్స్ గొప్పా, బిజినెస్ మ్యాన్ గొప్పా అని వాదించుకుంటారు. ఎవరు గొప్పో కస్టమర్స్‌తో చెప్పిస్తా అని రాజ్ అంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్