Siraj Dating: ఏం మాట్లాడుతున్నారు.. సిరాజ్‌తో మహిరా శర్మ డేటింగ్ రూమర్లపై ఆమె తల్లి కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Siraj Dating: ఏం మాట్లాడుతున్నారు.. సిరాజ్‌తో మహిరా శర్మ డేటింగ్ రూమర్లపై ఆమె తల్లి కామెంట్స్

Hari Prasad S HT Telugu
Jan 30, 2025 02:38 PM IST

Siraj Dating: సిరాజ్, మహిరా శర్మ డేటింగ్ రూమర్లపై ఆమె తల్లి స్పందించారు. ఏం మాట్లాడుతున్నారంటూ ఆమె షాక్ కు గురి కావడం గమనార్హం. బిగ్ బాస్ 13 ఫైనలిస్ట్ అయిన మహిరాతో టీమిండియా పేస్ బౌలర్ రిలేషన్షిప్ లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఏం మాట్లాడుతున్నారు.. సిరాజ్‌తో మహిరా శర్మ డేటింగ్ రూమర్లపై ఆమె తల్లి కామెంట్స్
ఏం మాట్లాడుతున్నారు.. సిరాజ్‌తో మహిరా శర్మ డేటింగ్ రూమర్లపై ఆమె తల్లి కామెంట్స్

Siraj Dating: టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ డేటింగ్ వార్తలు మరోసారి ఉత్తవే అని తేలిపోయాయి. బిగ్ బాస్ 13 ఫైనలిస్ట్ అయిన మహిరా శర్మతో అతడు డేటింగ్ చేస్తున్నట్లు బుధవారం (జనవరి 29) వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే మహిరా తల్లి సానియా శర్మ టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై స్పందించారు. ఆ వార్తల్లో అసలు ఏమాత్రం నిజం లేదని ఆమె కొట్టిపారేయడం గమనార్హం.

yearly horoscope entry point

సిరాజ్, మహిరా శర్మ డేటింగ్ నిజం కాదట

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఈ మధ్య తరచూ డేటింగ్ పుకార్లతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలుసు కదా. మొదట లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జానాయ్ భోస్లేతో అతడు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రాగా.. తమది అన్నాచెల్లెళ్ల బంధమని వాళ్లు స్పష్టం చేశారు.

ఆ తర్వాత బిగ్ బాస్ 13 ఫైనలిస్ట్ మహిరా శర్మతో అతడు డేటింగ్ చేస్తున్నాడని, అది కన్ఫమ్ అని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు తెలిపింది. కానీ తాజాగా టైమ్స్ నౌ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిరా శర్మ తల్లి సానియా శర్మ ఈ వార్తలపై స్పందించారు.

ఏది పడితే అది నమ్ముతారా?

సిరాజ్ తో తన కూతురు మహిరా డేటింగ్ గురించి ఈ ఇంటర్వ్యూలో సానియాను ప్రశ్నించారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. “ఏం మాట్లాడుతున్నారు? ఎవరో ఏదో అంటారు. ఇప్పుడు నా కూతురు ఓ సెలబ్రిటీ. ఆమె పేరును ఎవరైనా ఎవరితో అయినా లింక్ చేసి మాట్లాడతారు. వాటిని మనం నమ్మాలా?” అని ప్రశ్నించారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేశారు.

కాస్త సెలబ్రిటీ స్టేటస్ రాగానే వాళ్ల గురించి ఏవేవో ఊహాగానాలు రావడం సహజమని ఆమె చెప్పారు. గతేడాది నవంబర్ లో మహిరా పోస్టులను సిరాజ్ లైక్ చేయడం, ఆ తర్వాత ఇన్‌స్టాలో ఇద్దరూ ఒకరినొకరు ఫాలో అవడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. కానీ తాజాగా ఆమె తల్లి ఇచ్చిన క్లారిటీతో అవన్నీ అబద్ధమే అని తేలిపోయింది.

ఎవరీ మహిరా శర్మ?

మహిరా ఓ ప్రముఖ టీవీ నటి. నాగిన్, బేపనా ప్యార్, కుండలీ భాగ్యలాంటి సీరియల్స్ తో పాపులర్ అయింది. ఇక బిగ్ బాస్ 13లో పార్టిసిపేట్ చేసి ఫైనలిస్టుగా కూడా పేరు సంపాదించింది. 2023లో వచ్చిన పంజాబీ మూవీ లెంబర్‌గిన్నీలోనూ నటించింది.

నిజానికి మహిరా శర్మ గతంలో పరాస్ ఛాబ్రా అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. ఈ ఇద్దరూ బిగ్ బాస్ 13లోనే కలిసి ప్రేమలో పడ్డారు. కానీ 2023లో వీళ్లు విడిపోయారు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024