Best Web Hosting Provider In India 2024

వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి
అట్టహాసంగా పార్టీ అనుబంధ విబాగాల అధ్యక్షుల ప్రమాణస్వీకారం
వైయస్ఆర్ జిల్లా: ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోతే ఉద్యమం తప్పదని వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అనుబంధ విభాగాల నూతన అధ్యక్షులతో వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు చేతులెత్తేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంత మోసం చేస్తారా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబుకు అవగాహన లేదా? సూపర్‌సిక్స్ హామీలకు చంద్రబాబు,పవన్ కళ్యాణ్ నైతిక బాధ్యత వహించాలి. ఇచ్చిన అన్ని హామీలను వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ అమలు చేశారు. నవరత్నాలను నిక్కచ్చిగా అమలు చేసిన ఘనత ఆయనదే. సూపర్ సిక్స్ అమలు కోసం వైయస్ఆర్‌సీపీ ప్రజల పక్షాన పోరాడుతుంది’అని రవీంద్రనాథ్ తెలిపారు.