




Best Web Hosting Provider In India 2024

Carrot garelu: పిల్లల కోసం టేస్టీగా క్యారెట్ గారెలు చేసి చూడండి, రెసిపీ చాలా సులువు
Carrot garelu: ఇప్పుడు గారెలు ఒకేలా కాకుండా కాస్త కొత్తగా హెల్తీగా చేసి చూడండి. ఇక్కడ మేము క్యారెట్ గారెలు రెసిపీ ఇచ్చాము. ఇవి చాలా రుచిగా ఉంటాయి.
తెలుగిళ్లలో గారెలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పండగ వస్తే గారెలు ఉండాల్సిందే. అల్పాహారంలో కూడా గారెలు తినేవారి సంఖ్య ఎక్కువే. ఇప్పుడు ఒకేలాంటి గారెలు కాకుండా కాస్త కొత్తగా పిల్లల కోసం టేస్టీగా క్యారెట్ గారెలు వండి చూడండి. ఇవి మీకు కచ్చితంగా నచ్చుతాయి. పైగా ఇవి ఎంతో ఆరోగ్యకరం కూడా. సాధారణ గారెలతో పోలిస్తే క్యారెట్ గారెలు తినడం వల్ల ఎక్కువ పోషకాలు సరైనవి చేరుతాయి. ఇక్కడ మేము క్యారెట్ గారెల రెసిపీని ఇచ్చాము. దీనికోసం ముందుగానే పిండి రుబ్బి పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

క్యారెట్ గారెలు రెసిపీకి కావలసిన పదార్థాలు
క్యారెట్ తురుము – ఒక కప్పు
బొంబే రవ్వ – ఒక కప్పు
పెరుగు – ఒక కప్పు
ఉల్లిపాయ తురుము – పావు కప్పు
పచ్చిమిర్చి తురుము – రెండు స్పూన్లు
అల్లం తురుము – ఒక స్పూను
కొత్తిమీర తురుము – ఒక స్పూను
పుదీనా తురుము – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
మైదా – రెండు స్పూన్లు
చాట్ మసాలా – ఒక స్పూను
నీళ్లు – తగినంత
నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
ఉప్పు – రుచికి సరిపడా
క్యారెట్ గారెలు రెసిపీ
1. ఒక గిన్నెలో క్యారెట్ తురుము, పెరుగు, బొంబే రవ్వను వేసి బాగా కలుపుకోవాలి.
2. అందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి కలపాలి.
3. కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, అల్లం తురుము, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి తురుము, రుచికి సరిపడా ఉప్పు, ఉల్లిపాయల తురుము, కరివేపాకు తురుము వేసి బాగా కలపాలి.
4. అందులోనే మైదా పిండిని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
5. చాట్ మసాలాను కూడా బాగా కలపాలి.
6. గారెలు వేయడానికి ఎంత మందంగా పిండి కావాలో అంత మందంగా కలుపుకోవాలి.
7. దీన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
8. అవసరమైతే కొంచెం నీళ్లు చిలకరించుకోవచ్చు.
9. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేయాలి.
10. అందులో గారెల్లాగా చేత్తోనే వత్తుకొని పైన చల్లి పెట్టుకుని రెండు వైపులా వేయించుకోవాలి అంతే టేస్టీ క్యారెట్ గారెలు రెడీ అయినట్టే
సాధారణ గారెల కన్నా క్యారెట్ గారెలు టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా కూడా వస్తాయి. పిల్లలకి బాగా నచ్చుతాయి. పైగా దీనిలో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. ఇవి మీకు కచ్చితంగా నచ్చుతాయి.